Begin typing your search above and press return to search.

అక్క కంటే ముందే... సచిన్‌ టెండూల్కర్‌ కొడుకు పెళ్లికొడుకాయెనా..?

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఆసక్తికరమే. ఆయన కుటుంబం, వ్యక్తిగత జీవితం అన్నీ అభిమానులకు నోటివెంట వెంటనే వచ్చేస్తాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2025 9:16 AM IST
అక్క కంటే ముందే... సచిన్‌ టెండూల్కర్‌ కొడుకు పెళ్లికొడుకాయెనా..?
X

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ఆసక్తికరమే. ఆయన కుటుంబం, వ్యక్తిగత జీవితం అన్నీ అభిమానులకు నోటివెంట వెంటనే వచ్చేస్తాయి. సచిన్‌ జీవితంలో 24 ఏళ్లు దేశానికి పూర్తిగా కేటాయించాడు. 2013లో 40 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌ ఇచ్చాక మాత్రం పూర్తిగా ఫ్యామిలీకే సమయాన్ని ఇస్తున్నాడు. లెజెండ్స్‌ లీగ్‌ వంటి టోర్నీల్లో ఆడడం తప్ప కామెంట్రీ, కోచింగ్‌, గైడెన్స్‌ అంటూ పోటీ క్రికెట్‌తో మరెక్కడా టచ్‌లో లేడు. ఇక సచిన్ తన కుమారుడు అర్జున్‌ను క్రికెటర్‌ను చేయాలని చాలా ప్రయత్నించాడు. జట్టుకు బాగా ఉపయోగకరం అని ఎడమచేతి వాటం పేస్‌ బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌గా చూడాలనుకున్నాడు. కానీ, అదేమీ అనుకున్నంతగా ముందుకెళ్లలేదు.

ముంబై.. గోవా

ముంబైకర్‌ (ముంబైవాసి) అయిన సచిన్‌ తన కుమారుడిని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ద్వారానే తొలుత దేశవాళీల్లో ఆడించాలని భావించాడు.కానీ, విపరీతమైన పోటీ ఉండే ముంబైలో అర్జున్‌ ప్రతిభ సరిపోలేదు. తర్వాత గోవా రంజీ జట్టుకు వెళ్లాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ 2021లో అతడిని రూ.20 లక్షలకు కొనుక్కుంది. గాయంతో ఆ సీజన్‌కు దూరమైనా 2022లో రూ.30 లక్షలు పెట్టి తీసుకుంది. 2023లో అర్జున్‌ ఐపీఎల్‌ లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ తో తన తొలి మ్యాచ్‌ ఆడాడు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ పై తొలి వికెట్‌ తీశాడు. లీగ్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాడు. దేశవాళీల్లో గోవాకే ప్రాతినిధ‍్యం వహిస్తున్నాడు.

26 ఏళ్లకు చేరువలో..

మరో రెండు నెలల్లో అర్జున్‌ 26 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. ఈ క్రమంలోనే త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ముంబైకే చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనమరాలు సానియా ఛందోక్‌తో బుధవారం అర్జున్‌ టెండూల్కర్‌ నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల నడుమ జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. దీనిపై సచిన్‌ అతడి భార్య అంజలి నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

అక్క కంటే ముందే...

సచిన్‌కు అర్జున్‌తో పాటు కుమార్తె సారా ఉన్నారు. అర్జున్‌ కంటే ఆమెనే పెద్ద. 1997 అక్టోబరులో పుట్టిన ఆమెకు ఇప్పుడు 27 ఏళ్లు. అర్జున్‌ 1999 సెప్టెంబరులో పుట్టాడు. కానీ, అక్క సారాకంటే ముందే పెళ్లి పీటలెక్కుతున్నాడు. కాగా, సారాను.. టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో ముడిపెడుతూ గతంలో చాలా కథనాలు వచ్చాయి. అవి నిజమా..? అబద్ధమా? అనేది తేలలేదు.