పెళ్లి విందులో పనీర్ వడ్డించలేదని.. ఆరుగురు అతిథులను గాయపరిచాడు!
ఉత్తరప్రదేశ్ లోని చందౌలి జిల్లాలో ఒక వ్యక్తి ఓ వివాహ వేడుకలోకి మినీ బస్సును తీసుకెళ్లి ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు గాయపడిన ఘటన తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 29 April 2025 8:58 PM ISTఉత్తరప్రదేశ్ లోని చందౌలి జిల్లాలో ఒక వ్యక్తి ఓ వివాహ వేడుకలోకి మినీ బస్సును తీసుకెళ్లి ఢీకొట్టడంతో ఆరుగురు వ్యక్తులు గాయపడిన ఘటన తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆరుగురు వ్యక్తులు గాయపడటంతో పాటు సుమారు రూ.3 లక్షల విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. ఇంతకీ ఈ ఘటనకు కారణం ఏమిటంటే... 'పనీర్'!
అవును... ఉత్తరప్రదేశ్ లోని కొత్వాలి ప్రాంతంలోని హమీద్ పూర్ గ్రామంలో రాజ్ నాథ్ యాదవ్ కుమార్తె వివాహం జరిగింది. ఈ సందర్భంగా సాయంత్రం ఆలస్యంగా వివాహ ఊరేగింపు వేదిక వద్దకు చేరుకుంది. ఈ సమయంలో ధర్మేంద్ర యాదవ్ అనే ఓ వ్యక్తి వివాహ వేడుకలోకి ప్రవేశించి నేరుగా ఫుడ్ స్టాల్స్ వైపు వెళ్లాడు.
ఈ సమయంలో.. ధర్మేంద్ర యాదవ్ కి ఇతర వంటకాలలో పనీర్ దొరకలేదు. దీంతో.. అతనికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. దీంతో... ఓ మినీ బస్సును పెళ్లి వేడుక మధ్యలోకి నడిపాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఇదే సమయంలో... రూ.3 లక్షలకు పైగా విలువైన వస్తువులు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని రాజ్ నాథ్ యాదవ్ తెలిపారు.
ఈ దాడిలో గాయపడినవారిలో వరుడి తండ్రి, వధువు మేనమామ సహా అనేక మంది గాయపడ్డారు. ప్రస్తుతం వారు వారణాసిలోని ట్రామా సెంటర్ లో వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అనంతరం వరుడి తరుపు వారు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన అనంతరం.. వరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వివాహ వేడుక ముగిసింది.