పవన్ వర్సెస్ బాబు: ఆ రెండు విషయాల్లే.. తేడా కొడుతోంది.. !
అయితే.. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందులు లేవు. పదవుల విషయంలో పార్టీలు ఆశించిన మేరకు సీఎం చంద్రబాబు ఇచ్చేశారు.
By: Garuda Media | 14 Aug 2025 12:00 AM ISTకూటమి ప్రభుత్వంలో భారీ ఎత్తున లుకలుకలు వినిపించకపోయినా.. రెండు కీలక విషయాల్లో మాత్రం విభేదాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. అయితే.. ఇవి కూడా రోడ్డున పడకుండా.. అంత ర్గతంగా పరిష్కరించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వాస్తవానికి సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇబ్బందులు తప్పవు. పదవులు, గౌరవాలు, ప్రొటోకాల్.. వంటి అనేక అంశాలు తరచుగా తెరమీదికి వస్తాయి. అవే వివాదాలుగా మారుతుంటాయి.
అయితే.. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఇలాంటి ఇబ్బందులు లేవు. పదవుల విషయంలో పార్టీలు ఆశించిన మేరకు సీఎం చంద్రబాబు ఇచ్చేశారు. ఇక, గౌరవ మర్యాదలకు కూడా లోటు లేకుండానే చూసుకుంటున్నారు. అంతేకాదు.. తొలి ఏడాది కలివిడి అద్భుతంగానే ఉంది. అయితే.. ఆ తర్వాత నుంచి మాత్రం కొంత తేడా కొడుతోందన్నది కూటమి పార్టీల్లోనే చర్చగా మారింది. తమ శాఖపై జోక్యం చేసుకుంటున్నారని.. జనసేనకు చెందిన ఓ మంత్రి నేరుగా పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు.
తమ శాఖను స్వచ్ఛంగా మార్చే ప్రయత్నంలో ఉన్నామని.. కానీ.. టీడీపీవైపు నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని.. అక్రమాలు నిలువరించలేక పోతున్నామని సదరు మంత్రి చెబుతున్న మాట అని అంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు కూడా దీనికి ఊతంగా మారాయి. ఏదైనా అక్రమం జరిగినప్పుడు నిలువరించే ప్రయత్నం చేయగా.. వెంటనే ఫోన్లు రావడం.. సదరు వ్యక్తులను వదిలేయడంతో ప్రత్యర్థుల నుంచి జనసేన మంత్రిపై విమర్శలు పెరుగుతున్నాయి. దీనిని నిలువరించాలని, తమ శాఖను స్వేచ్ఛగా పనిచేసుకునేలా ఉంచాలన్నది పవన్ చెబుతున్న మాట అని అంటున్నారు.
ఇక, రెండోది.. కేంద్రం నుంచి వచ్చిన 1132 కోట్ల రూపాయల నిధులు. ఇవి.. గ్రామీణ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా కేంద్రం పంపించింది. దీనికి 10 శాతం అదనంగా రాష్ట్ర వాటా ను జోడించి.. గ్రామీణ ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి విడుదల చేయాలి. కానీ.. ఈనిధులు వచ్చి రెండు మాసాలు అయిపోయినా.. పవన్ కల్యాణ్ పదే పదే కోరినా.. ఈ నిధులను ఆర్థిక శాఖ విడుదల చేయలేదు. తద్వారా పంచాయతీల్లో మళ్లీ వైసీపీ హయాం నాటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ పరిణామాలే పవన్ కల్యాణ్ వర్సెస్ చంద్రబాబుకు మధ్య కొంత దూరం పెంచుతున్నాయన్నది పరిశీలకులు చెబుతు న్నమాట.