ఈ జోరు.. 2029కి హుషారు.. కూటమి ప్లాన్.. !
మరీ ముఖ్యంగా తాజాగా ఖాళీ అయిన.. రాజ్యసభ సీటు విషయంలోనూ వ్యూహాత్మ కంగా అడగులు వేసింది.
By: Tupaki Desk | 30 April 2025 12:45 AM ISTకూటమి ప్రభుత్వంలోని పార్టీలు.. పక్కా ప్లాన్‌తో దూసుకుపోతున్నాయి. వ్యూహం.. వేయడమే కాకుండా.. దానిని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వచ్చే ఎన్నికలకు ప్రధాన పునాదులను బలోపేతం చేసుకుంటున్నాయి. మూడు పార్టీలూ కలిసి సంయుక్తంగా ముందుకు సాగడంతోపాటు.. రాజకీయంగా కూడా.. స్వల్ప పొరపొచ్చాలు మినహా మిగిలిన అన్ని విషయాల్లోనూ కలిసి ముందుకు సాగుతున్నాయి. దీంతో ఐక్యతకు పెద్ద పీట వేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా పదవుల పంపకం ద్వారా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకుల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ, జనసేనతో కలిసి ముందుకు సాగుతున్న టీడీపీ.. ఈ వ్యవహారాన్ని మరింత జాగ్రత్తగా తీసుకుంది. ఏ పదవులు అందుబాటులో ఉన్నా.. చర్చలు-వివాదాలకు తావు లేకుండా పంపకాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా తాజాగా ఖాళీ అయిన.. రాజ్యసభ సీటు విషయంలోనూ వ్యూహాత్మ కంగా అడగులు వేసింది.
ఇక, మరో ముఖ్య విషయం.. ప్రజలను కలుసుకోవడం. వారి కష్టాలు వినడం.. పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం అనే విషయాలు కీలకంగా మారాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు చాలా వరకు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నా.. వెంటనే పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలతోమమేకమవుతున్నారు. ఎక్కడా లోపాలు రాకుండా.. లేకుండా కూడా చూసుకుంటున్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తోంది.
అదే సమయంలో ఎక్కడా ఎవరూ వివాదాలకు అవకాశం లేకుండా.. కార్యకర్తలను, నాయకులను అదుపు చేస్తున్నారు. వాస్తవానికి కూటమి పార్టీల మధ్య విభేదాలు రావడం కామనే. ఇప్పటి వరకు జరిగిన పది మాసాల్లో వివాదాలు, విభేదాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ.. కూటమి పార్టీలు తమలోతామే సర్దుబా టు ధోరణంతో ముందుకు సాగాయి. ఇది.. ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత పెంచడంతో పాటు.. వచ్చే 2029 ఎన్నికలకు కూడా బీజం పడేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు.