అల్లు అర్జున్ వస్తే అట్లుంటదీ మరీ!
పుష్ప రాజ్ ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు మరీ.. అట్లుంటదీ.. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ మన బన్నీ క్రేజ్ తగ్గలేదు.
By: Tupaki Desk | 7 July 2025 10:25 AM ISTపుష్ప రాజ్ ఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు మరీ.. అట్లుంటదీ.. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ మన బన్నీ క్రేజ్ తగ్గలేదు. ఆయన ఎంట్రీ ఇవ్వగానే ‘రప్ప.. రప్ప’ అంటూ అమెరికాలోని ప్రవాసులు ఊగిపోయారు. పిచ్చెక్కిపోయారు.. అమెరికాలో అల్లు అర్జున్ క్రేజ్ చూసి అంతా అవాక్కయ్యారు. ఇది చూసి తనకు హైదరాబాద్ లో, విశాఖలో ఉన్న ఫీలింగ్ కలుగుతోందని.. ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నామన్న ఫీలింగ్ లేదంటూ మీ అభిమానం అలా ఉందంటూ అల్లు అర్జున్ ఉబ్బితబ్బిబయ్యారు.
అమెరికా ఫ్లోరిడాలోని టాంపాలో జరిగిన ఎనిమిదవ అమెరికా తెలుగు సంబరాలు (NATS 2025) వేడుకలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన కేవలం అతిథిగా మాత్రమే కాకుండా, ప్రపంచ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించారు. టాంపా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ ఉత్సవంలో అల్లు అర్జున్ అడుగుపెట్టిన క్షణం నుంచి అద్భుతమైన ఉత్సాహం వెల్లివిరిసింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తమ వ్యక్తిగా భావించి ఆయనపై చూపిన ప్రేమ అసాధారణం. టాంపాలో ఆయనకు లభించిన ఘన స్వాగతం, శుభాకాంక్షలు దీనికి నిదర్శనం. అభిమానుల ప్రేమను చూసి అల్లు అర్జున్ హృదయం ఆనందంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఆయన “పుష్ప 2” లోని “రప్ప రప్ప” డైలాగ్‌ను స్టేజ్‌పై పలకడం అభిమానులను మరింత ఉర్రూతలూగించింది.
ఈ వేడుక మొత్తం తెలుగు ప్రజలకు తమ అభిమాన నటుడిని చూసిన ఆనందాన్ని పంచుకున్నట్టైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అభిమానించబడే తెలుగు హీరోగా అల్లు అర్జున్ పేరు స్థిరపడిపోయింది. ఆయన కెరీర్ విజయాలకన్నా, ఆయన తన మూలాలపట్ల చూపించే గౌరవం, నిబద్ధత ప్రజల హృదయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి.
స్టేజ్‌పై ఆయన పలికిన ప్రతి మాట, చేసిన ప్రతి చేష్ట ఆయన స్టార్‌డమ్‌కు అద్దం పట్టాయి. అల్లు అర్జున్ కేవలం ఒక సినీ తారగా మాత్రమే కాకుండా, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా మారారు. ప్రపంచ పటంలో తెలుగు భాష, సంస్కృతి గర్వంగా నిలవడానికి అల్లు అర్జున్ వంటి వారే కారణం. నాట్స్ 2025 వేడుకలో ఈ గర్వాన్ని ప్రజలు మరొకసారి ఆస్వాదించారు. తెలుగు ప్రజల గుండెల్లో “పుష్ప రాజ్” ఎప్పటికీ అల్లు అర్జున్ నిలిచే ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు!