అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఏఐబీ నివేదిక వచ్చేసింది!
అవును... అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2025 3:12 PM ISTజూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ దిగ్భ్రాంతికర విమాన ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలోనూ 241 మంది మృతి చెందగా.. స్థానికంగా ఉన్నవారు 19 మంది మరణించారు. ఈ సమయంలో ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వచ్చినట్లు తెలుస్తోంది.
అవును... అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆ మరుసటిరోజే ప్రమాదంపై దర్యాప్తునకు ఏఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో... ఈ ప్రమాదంపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ఆధారంగా ప్రాథమిక నివేదిక రూపొందించింది.
ఈ క్రమంలో... దాన్ని తాజాగా కేంద్ర పౌర విమాన మంత్రిత్వశాఖతో పాటు సంబంధిత ఇతర అధికారులకు సమర్పించినట్లు ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రస్తుతానికి ఈ నివేదికలో ఏ విషయం ఉందనేది మాత్రం అధికారులు బయటపెట్టలేదు. ఈ వారాంతంలో ఆ నివేదికను మీడియాకు విడుదల చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
బ్లాక్ బాక్స్ లోని డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్, మేడే కాల్, చివరి నిమిషంలో సిబ్బంది చర్యలు, వాతావరణ పరిస్థితులు మొదలైన అంశాలతో ఈ ప్రాథమిక నివేదిక రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికతో నాడు జరిగిన ఆ దిగ్భ్రాంతికర ప్రమాదానికి గల కారణాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది!
కాగా... ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ కమిటీలో ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు, నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు సభ్యులుగా ఉన్నారు.