ఏబీవీ ఏమయ్యారు... ఆయన పాలిటిక్స్ ఏమయ్యాయి..?
ఈ విషయంలో ఏబీవీ ఎక్కడో తప్పుచేశారన్న భావన వ్యక్తమవుతోంది. నేరుగా ఆయన స్వీయ ప్రకటన చేసేశారు.
By: Tupaki Desk | 29 April 2025 6:19 PM IST''ఈ క్షణం నుంచే రాజకీయాల్లో వస్తున్నా'' అంటూ.. సుమారు రెండు వారాల కిందట అనూహ్య ప్రకటన చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆలూరి బాల వెంకటేశ్వరరావు ఉరఫ్ ఏబీవీ ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. ఆయన ప్రకటన వరకు బాగానే ఉంది. కానీ.. ఆ తర్వాత.. మాత్రం ఎక్కడా కనిపించలేదు. పైగా అసలు ఆయన గురించి వార్తలు కూడా రావడం లేదు.
సాధారణంగా ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు రాజకీయాల వైపు మొగ్గు చూపడం కామనే. రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోనూ అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉద్యోగాలు వదులుకుని మరీ ప్రజాసేవలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.ఈ కోణంలో చూసుకుంటే.. ఏబీవీ నిర్ణయం కావొచ్చు.. ఆయన ప్రకటన కావొచ్చు.. ఏదైనా సరైందే. కానీ, తర్వాత.. అనుసరించే వ్యూహం.. తీసుకునే నిర్ణయం మాత్రం అత్యంత ప్రాధాన్య సంతరించుకున్నాయి.
ఈ విషయంలో ఏబీవీ ఎక్కడో తప్పుచేశారన్న భావన వ్యక్తమవుతోంది. నేరుగా ఆయన స్వీయ ప్రకటన చేసేశారు. వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు మేధావులను సంప్రదించడంతో కార్యక్ర మానికి శ్రీకారం చుట్టాలి. మరి ఏబీవీ ఎవరిని సంప్రదించారన్నది తెలియదు కానీ.. ఆయన ప్రకటించారు. ఇక, రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారంటే.. ప్రజాసేవ కోసం అని నాయకులు చెబుతారు. ఇది సహజం. అప్పటి వరకు ఆయనకు లేదా ఆవడకు అనేక భావాలు ఉందొచ్చు.
కానీ.. రాజకీయంగా మారిన తర్వాత.. కొన్ని పద్ధతులు పాటించాలి. ప్రజలకు చేరువ కావాలి. ప్రజలను మచ్చిక చేసుకోవాలి. కానీ.. జగన్ చేత-జగన్ వలన-జగన్ కోసం.. అనే అసహజ సిద్ధాంతాన్ని పట్టుకుని వచ్చిన నేపథ్యంలోనే కీలకమైన టీడీపీ నుంచి ఎలాంటి ఆహ్వానాలు రాలేదు. ఎవరూ పన్నెత్తు మద్దతు కూడా ప్రకటించలేదు. సో.. ఎలా చూసుకున్నా.. ఏబీపీ ఇప్పట్లో రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశం లేదని అంటున్నరు పరిశీలకులు.