Begin typing your search above and press return to search.

పిల్లిలా కనిపించాలని కాస్మొటిక్ సర్జరీ... యువతి రిజల్ట్ ఇదే!

ఇటీవల కాలంలో చాలా మంది చాలా రకాల కాస్మొటిక్ సర్జరీలు చేసుకుంటారనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 April 2025 3:00 AM IST
పిల్లిలా కనిపించాలని  కాస్మొటిక్  సర్జరీ... యువతి రిజల్ట్  ఇదే!
X

ఇటీవల కాలంలో చాలా మంది చాలా రకాల కాస్మొటిక్ సర్జరీలు చేసుకుంటారనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొంతమంది ముక్కుకు, మరికొంతమంది పెదవులకు, మరికొంతమంది ఇతర శరీర భాగాలకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంటారు. ఈ సమయంలో ఓ మహిళ పిల్లిలా కనిపించాలని కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్న ఘటన వెలుగుచూసింది.

అవును... తాను పిల్లిలా కనిపించాలని భావించిన 29 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ.. ఆ కాస్మొటిక్ ప్రక్రియల కోసం భారత కరెన్సీలో సుమారు రూ.6.6 లక్షలు ఖర్చు చేసింది. గోల్డ్ కోస్ట్ కు చెందిన జోలీన్ డాసన్ తన చెంప ఎముకలను పదును పెట్టడానికి, ముక్కు రంద్రాలను మార్పు చేయడానికి రూపొందించిన ప్రయోగాత్మక కాస్మొటిక్ చికిత్స చేయించుకుంది!

అయితే.. ఆ ఫలితాలు ఆమెకు బాధాకరమైన దుష్ప్రభావాలను మిగిల్చాయి. ఈ సందర్భంగా స్పందించిన ఆమె... తన ముఖం దిగువ భాగం యొక్క కూర్పును ఆ చికిత్సలు ఎలా మార్చాయో తాను ఎప్పుడూ ఊహించలేపోయినట్లు వెల్లడించింది. పిల్లిలా కనిపించడానికి అవసరమైన విధానాలు ఉన్నప్పటికీ.. తాను పిల్లి అని ఎప్పుడూ గుర్తించలేదని తెలిపింది.

ఇలా కనిపించే మచ్చలు, సమస్యలకు మించి డాసన్ ఊహించని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొందని చెబుతున్నారు. వాటిలో నాసికా కుహరం దెబ్బతిన్న పరిస్థితి. అయితే కాలక్రమంగా ఈ ప్రక్రియలు తిరిగి మార్చగలవనేదానిపై ఆమెకు నమ్మకం ఉన్నప్పటికీ.. ఆమెకు ఇప్పటికే జరిగిన నష్టం ఊహించినదానికంటే లోతైనదని చెబుతున్నారు.