తెలుగు ప్రజల ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ షాకింగ్ సర్వే!
ప్రస్తుతం అందరూ ఫిట్‌గా ఉండాలని తెగ ట్రై చేస్తున్నారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది.
By: Tupaki Desk | 28 April 2025 9:51 AM ISTప్రస్తుతం అందరూ ఫిట్‌గా ఉండాలని తెగ ట్రై చేస్తున్నారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. అపోలో హాస్పిటల్స్ వాళ్లు కొత్తగా ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఏం తేలిందంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 82 శాతం మంది జనాలు ఊబకాయంతోనో లేకపోతే ఎక్కువ బరువుతోనో బాధపడుతున్నారంట. అంటే వంద మందిలో 82 మంది లావుగా ఉన్నారన్నమాట. ఇది నిజంగా షాకింగ్ విషయమే కదా.
ఇంకా ఏముందంటే.. చాలా మందిలో విటమిన్ 'డి' కూడా తక్కువగా ఉందట. దాదాపు 81 శాతం మందికి అది సరిగ్గా లేదు. ఇకపోతే చాలా మందికి బీపీ ఎక్కువ, లివర్ పాడైపోవడం, రక్తం తక్కువ ఉండటం లాంటి సమస్యలు కూడా ఉన్నాయట. ఎంతంటే 24 శాతం మందికి బీపీ ఎక్కువ, 47 శాతం మందికి ఫ్యాటీ లివర్, 27 శాతం మందికి రక్తహీనత ఉందట.
ఇది మాత్రమే కాదు, చాలా మందికి ఒళ్లు కూడా వంగట్లేదంట. అంటే సరైన ఎక్సర్‌సైజ్లు చేయట్లేదని అర్థం. దాదాపు 83 శాతం మంది సరిగ్గా కదలట్లేదట. మానసిక ఆరోగ్యం కూడా అంత బాగా లేదు. ఆడవాళ్లలో 7 శాతం మందికి, మగవాళ్లలో 5 శాతం మందికి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్నాయట. అది కూడా 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లలో ఎక్కువట.
అసలు విషయం ఏంటంటే.. ఈ సమస్యలతో బాధపడుతున్న చాలా మందికి అసలు విషయం తెలియదంట. తాము బాగానే ఉన్నామని ఒక భ్రమలో బతికేస్తున్నారట. కానీ నిజం చూస్తే మాత్రం చాలా తేడాగా ఉంది. ఈ లెక్కలు చూస్తుంటే మన తెలుగు ప్రజల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చిందనే అనిపిస్తుంది.