ఎల్లమ్మ లేట్ కి రీజన్ ఏంటి..?
ఎల్లమ్మ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా రెడీ అయ్యింది. సెట్స్ మీదకు వెళ్లడమే లేట్ అనేలా ఉంది.
By: Ramesh Boddu | 13 Aug 2025 12:07 PM ISTనితిన్ వేణు యెల్దండి కాంబినేషన్ లో రాబోతున్న ఎల్లమ్మ సినిమా ఈపాటికి సెట్స్ మీదకు వెళ్లాల్సింది కానీ మేకర్స్ ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదు. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. బలగం తో సూపర్ హిట్ ఇచ్చిన వేణుకి ఈసారి ఎల్లమ్మ కోసం మరింత ఫ్రీడం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ చేయిస్తున్నారట. ఐతే ఈ సినిమాకు ముందు అంటే రీసెంట్ గానే నితిన్ తో దిల్ రాజుకి పెద్ద షాక్ తగిలింది. తమ్ముడు సినిమా రిలీజై డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా మీద దిల్ రాజు చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ రిజల్ట్ చూసి షాక్ అయ్యాడు.
నితిన్ మీదే ఖర్చు చేస్తున్నాడు దిల్ రాజు..
తమ్ముడు తర్వాత ఎల్లమ్మకి కూడా నితిన్ మీదే ఖర్చు చేస్తున్నాడు దిల్ రాజు. ఆల్రెడీ అనౌన్స్ మెంట్ వచ్చింది కాబట్టి హీరోని మార్చడం కుదరదు. నితిన్ కూడా ఎల్లమ్మ కోసం అంతా సిద్ధమవుతున్నాడు. తమ్ముడు సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే ఎల్లమ్మ కోసం తాను ఎంత ఇస్తే దానికి రెట్టింపు పేరు వస్తుందని అన్నాడు. సో కథ, స్క్రీన్ ప్లే అంతా కూడా బలగం తరహాలోనే ఎమోషనల్ రైడ్ గా ఉంటుందని టాక్.
ఐతే దిల్ రాజు ఇంకా ఎక్కడో థింక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. ఎల్లమ్మ లో కీర్తి రోల్ అదిరిపోతుందట. మరోసారి ఆమె పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ చేస్తుందని తెలుస్తుంది. ఇదే కాదు దిల్ రాజు విజయ్ దేవరకొండతో చేస్తున్న రౌడీ జనార్ధన్ లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. ఈ రెండు సినిమాలకు కలిపి ఆమె రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది.
ఎల్లమ్మ ప్రీ ప్రొడక్షన్ వర్క్ రెడీ..
ఎల్లమ్మ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా రెడీ అయ్యింది. సెట్స్ మీదకు వెళ్లడమే లేట్ అనేలా ఉంది. ఐతే ఈమధ్య ప్రొడక్షన్ లో భారీగా లాసులు ఫేస్ చేస్తున్న దిల్ రాజు ఎల్లమ్మ విషయంలో ఇంకా ఆలోచనలోనే ఉన్నారట. మరి ఈ ఆలోచన ఎందుకు ఏమిటి అన్న క్లారిటీ లేదు. సో ఎల్లమ్మ సినిమా మొదలైనప్పుడే ప్రాజెక్ట్ ఓకే అయినట్టు లెక్క. ఈలోగా ఏదైనా పెను మార్పులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి వేణు యెల్దండి, దిల్ రాజు ఏం చేస్తారన్నది చూడాలి.
ఎల్లమ్మ సినిమాను నానితో చేయాలని అనుకున్నాడు దిల్ రాజు. వేణు కథ కూడా చెప్పాడు. కథ నచ్చినా కూడా హీరోయిన్ డామినేషన్ ఎక్కువ ఉందని నాని సినిమా కాదనేశాడు. అందుకే నితిన్ ని లైన్ లోకి తెచ్చారు. సినిమా అసలైతే ఆగష్టులో షూటింగ్ అన్నారు. ఎప్పుడు మొదలు పెడతారన్నది అప్డేట్ రావాల్సి ఉంది.