6877 థియేటర్లలలో ఎవరి దమ్మెంత?
రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు `వార్-2`, `కూలీ` ఆగస్టు 14న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 11 Aug 2025 6:59 PM ISTరెండు భారీ పాన్ ఇండియా సినిమాలు `వార్-2`, `కూలీ` ఆగస్టు 14న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఒక్కరోజు కూడా వ్యవధి లేకుండా రెండూ పోటా పోటీగా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమా లపై పెద్ద ఎత్తున డిబేట్లు నడుస్తున్నాయి? ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది? అన్న దానిపై సర్వత్రా చర్చకు తెర తీసింది. ఎవరి దమ్మెంత అన్నది తేలాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే. అయితే ఈ రెండు సినిమాలు అంతకు ముందే థియేటర్ల కోసం పోటీ పడుతున్నాయి.
ఒకే రోజు రిలీజ్ కావడంతో స్క్రీన్ల కోసం బిగ్ ఫైట్ నడుస్తోంది. దీంతో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి? అన్నది ఆసక్తి కరంగా మారింది. ఓపెనింగ్స్ కి కీలకంగా మారేది థియేటర్ల నెంబరే. తొలి రోజు ఎన్ని ఎక్కువ థియేటర్లలో షో పడితే? ఓపెనింగ్స్ అదే స్థాయిలో ఉంటాయి. తొలి షో అనంతరం టాక్ అటూ ఇటూ అయినా? మొదటి రోజు వసూళ్లే కీలకం. దీంతో దేశీయంగా ఉన్న థియేటర్లలో ఏ సినిమా ఎన్ని థియేటర్లలో పడుతుందో ఆసక్తి కరంగా మారింది.
దేశంలో మొత్తం 6,877 థియేటర్లు ఉండగా వాటిలో ఏపీ -తమిళనాడు టాప్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు 1,097 ఉండగా, తమిళ నాడులో 943, కర్ణాటకలో 719, మహారాష్ట్రలో 703, తెలంగాణలో 485 థియేటర్లు ఉన్నాయి. టాప్ 5లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలకే చోటు దక్కడం విశేషం. గుజరాత్ -420, బెంగాల్-373, ఉత్తర ప్రదేశ్-321, బీహార్ -315, మధ్యప్రదేశ్-188, రాజస్తాన్ -178, ఒడిసా-141, కేరళలో 289 థియేటర్లు ఉన్నాయి. ఇది కేవలం దేశీయంగా ఉన్న థియేటర్ల లెక్క మాత్రమే. వీటన్నింటిలో మేజర్ థియేటర్లన్నింటిని కూలీ, వార్ 2 బ్లాక్ ఆగస్టు 14 నుంచి బ్లాక్ చేసాయి.
అయితే ఈ రెండు సినిమాల్లో ఏ హీరో చిత్రం అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతుంది? ఏ హీరో ఎక్కువ థియేటర్లు దక్కించుకున్నారు? అన్నది సస్పెన్స్. థియేటర్ల పరంగా తీవ్రమైన పోటీ ఉంటుంది. సినిమా రిలీజ్ కు ముందు నిర్మాతలు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంతనాలు తప్పనిసరి. రకరకాల కండీషన్ల ఆధారంగా సినిమా రిలీజ్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో `వార్ -2`, `కూలీ` థియేటర్ల లెక్క తేలాల్సి ఉంది.