హృతిక్ రోషన్, రజనీకాంత్ కలిసి నటించారు తెలుసా..!
హృతిక్ రోషన్ వార్ 2 కి పోటీగా రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ కాబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాను అదే ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు.
By: Ramesh Palla | 12 Aug 2025 9:00 PM ISTఏడాదిలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్‌కి ఆగస్టు 14న తెర లేవనుంది. హిందీలో హృతిక్ హీరోగా, ఎన్టీఆర్ ముఖ్య పాత్రలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన 'వార్ 2' విడుదల కాబోతుంది. హృతిక్ రోషన్ గతంలో చేసిన వార్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే వార్ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వార్ 2 సినిమా ఉంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వస్తున్న స్పై థ్రిల్లర్ యూనివర్శల్ లో వార్ 2 ఒకటిగా నిలువబోతుంది. వార్ 2 లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా పలువురు బాలీవుడ్ స్టార్స్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. వార్ 2 కి సాలిడ్ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయం అనే నమ్మకంతో ఉన్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ
హృతిక్ రోషన్ వార్ 2 కి పోటీగా రజనీకాంత్ కూలీ సినిమా రిలీజ్ కాబోతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమాను అదే ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. కూలీ సినిమాలో రజనీకాంత్ మాత్రమే కాకుండా నాగార్జున, అమీర్ ఖాన్, సౌబిన్ వంటి స్టార్స్ నటించారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా, పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో కనిపించబోతుంది. భారీ స్టార్ కాస్ట్‌కి తోడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం సినిమాపై అంచనాలు భారీగా పెంచుతుంది. కూలీ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అని ఇప్పటికే మొదలైన ప్రీ సేల్ ను చూస్తే అర్థం అవుతుంది. మొదటి రోజు అత్యధిక వసూళ్ల రికార్డ్‌ను కూలీ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
కూలీ వర్సెస్ వార్ 2 ఢీ అంటే ఢీ
వార్ 2 హిందీ సినిమా కాగా, కూలీ తమిళ్ సినిమా. అయినా కూడా ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద వార్ కి రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడం వల్ల ఖచ్చితంగా రెండు సినిమాలకు ఓపెనింగ్స్ డే రోజు ఎంతో కొంత నష్టం తప్పదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. చాలా కాలం ఒక భారీ వార్ బాక్సాఫీస్ వద్ద చూడబోతున్నాం. రజనీ, హృతిక్ ల ఈ వార్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమయంలోనే వీరిద్దరి బలాబలాల గురించి చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో 1986లో వచ్చిన భగవాన్ దాదా సినిమా గురించి చర్చ జరుగుతోంది.
రజనీకాంత్, హృతిక్ రోషన్ కలిసి భగవాన్ దాదా సినిమాలో...
ఓం ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన రజనీకాంత్ భగవాద్ దాదా సినిమాలో హృతిక్ రోషన్ బాల నటుడిగా కనిపించాడు. రాకేష్ రోషన్ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో పాటు, హృతిక్ రోషన్ ను చిన్న పాత్రకు గాను నటింపజేశాడు. ఆ సినిమాలో శ్రీదేవి, టీనా, పరేష్ రావల్, డానీ డెంజోంగ్పా లు ముఖ్య పాత్రలో నటించారు. రజనీకాంత్, హృతిక్ కాంబోలో ఉన్న సీన్స్ ను కొందరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితం ఒకే సినిమాలో నటించిన ఇద్దరు సూపర్ స్టార్స్ తిరిగి వారి వారి సినిమాలతో బాక్సాఫీస్ పోటీకి సిద్ధం అవుతున్నారు. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసే విధంగా బజ్ ను కలిగి ఉన్నాయి. మరి రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది, రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధిస్తుంది అనేది చూడాలి.