Begin typing your search above and press return to search.

వార్ ఐతే వన్ సైడ్ కాదు..!

ఆగష్టు 14న వార్ 2 వస్తుంది. ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా కూడా వస్తుంది.

By:  Ramesh Boddu   |   11 Aug 2025 10:15 AM IST
వార్ ఐతే వన్ సైడ్ కాదు..!
X

మామూలుగా ఒక బాలీవుడ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే సౌత్ లో అంత సందడి ఏమి ఉండదు. కానీ వార్ 2 కి మాత్రం సౌత్ లో ముఖ్యంగా తెలుగులో ఈ రేంజ్ బజ్ కి కారణం మన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. RRR తో ఆల్రెడీ బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించిన తారక్ ఈసారి అక్కడ సినిమా చేసి మరింత దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ఎన్ టీ ఆర్ నటించాడు కాబట్టే పాన్ ఇండియా లెవెల్ లో వార్ 2కి ఈ రేంజ్ క్రేజ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ..

ఆగష్టు 14న వార్ 2 వస్తుంది. ఈ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా కూడా వస్తుంది. కూలీ సినిమాలో మన కింగ్ నాగార్జున విలన్ గా నటించాడు. నాగార్జున విలన్ గా చేశాడు అంటే అది కచ్చితంగా సంథింగ్ స్పెషల్ అనాల్సిందే. లోకేష్ కనకరాజ్ తన టాలెంట్ మొత్తం చూపించబోతున్నాడని అంటున్నారు. ఐతే వార్ 2 వర్సెస్ కూలీ సినిమాల మధ్య ఈ ఫైట్ క్రేజీగా ఉంది.

వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ హైలెట్ కాగా.. కూలీలో రజినీ, నాగార్జున మాత్రమే కాదు ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరి క్యామియోస్ కూడా సినిమాకు ఒక రేంజ్ హై ఇస్తాయని అంటున్నారు. కూలీ సినిమాలో ఈ స్టార్ కెమియోతో పాటు లోకేష్ ఇచ్చే ట్విస్టులు కూడా సర్ ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. మరోపక్క కూలీ సినిమాలో యాక్షన్ సీన్స్, విజువల్స్ ఇవన్నీ కూడా అబ్బురపరుస్తాయని అంటున్నారు.

రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్..

వార్ 2, కూలీ ఈ ఉంది. ఐతే ఈ సినిమాల మధ్య వార్ మాత్రం వన్ సైడ్ అయ్యేలా లేదు. రెండు ఒకదానికి మించి మరొకటి అనిపించేలా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా సినిమా పూర్తిగా ఆడియన్స్ అంచనాలను అందుకోకపోతే అప్పుడు రెండో సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండు సినిమాలకు మార్నింగ్ షో టాక్ తోనే సినిమా భవితవ్యం ఏంటన్నది తెలుస్తుంది.

వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు తమ బెస్ట్ ఇచ్చారు. సినిమాలో కియరా అద్వాని గ్లామర్ షో కూడా హైలెట్ అయ్యేలా ఉంది. ఇటు పక్క కూలీ సినిమాలో శృతి హాసన్ రోల్ ఇంప్రెస్ చేసేలా ఉండగా పూజా హెగ్దే మోనికా సాంగ్ ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది. మొత్తానికి రెండు సినిమాలు బ్తాలెన్సింగ్ బాగుంది. అసలు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.