'వార్ -2' పబ్లిసిటీ స్ట్రాటజీలో భారీ మార్పులా!
'వార్ -2' భారీ అంచనాల మద్య ఆగస్టు 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రచారానికి సంబంధిం చిన ప్రణాళిక కూడా సిద్దమవుతోంది.
By: Tupaki Desk | 8 July 2025 8:15 PM IST'వార్ -2' భారీ అంచనాల మద్య ఆగస్టు 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రచారానికి సంబంధిం చిన ప్రణాళిక కూడా సిద్దమవుతోంది. ఇందులో నటిస్తోన్న హృతిక్ రోషన్- తారక్ లు ఈ చిత్రాన్ని వేర్వే రుగా ప్రచారం చేస్తున్నట్లు తెరపైకి వచ్చింది. ఒకరి కొకరు సంబంధం లేకుండా..ఎదురెదురు పడకుం డా..క్లాష్ అవ్వకుండా ప్రచారం చేయాలని ప్లాన్ చేసినట్లు వినిపించింది. ఇలా ప్రచారం చేయడం వల్ల సినిమాకు రీచ్ ఎక్కువగా ఉంటుందని..హిందీ..తెలుగు భాషల్లోకి మరింత స్ట్రాంగ్ గా వెళ్తుందన్నది మేకర్స్ ఆలోచన.
దీంతో హిందీలో ప్రచారానికి సంబంధించి బాధ్యతలన్నీ హృతిక్ తీసుకోగా..తెలుగుకు సంబంధించి తారక్ భుజాలపై వేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. సినిమాకు పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ నేపథ్యంలో భారీ ఎత్తున ఓపెనింగ్స్ రావాలంటే ఇలాంటి స్ట్రాటజీ అనివార్యమని భావించి ఈ రకంగా బరిలోకి దిగారు. సరిగ్గా అదే రోజున 'కూలీ' కూడా రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఫైట్ టఫ్ గా ఉంటుందనే? టాక్ కూడా బలంగా విని పిస్తుంది. 'వార్ 2' కంటే 'కూలీ'నే బెటర్ స్థానంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచారం స్ట్రాటజీ మారుస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వస్తోంది. తెలుగు ప్రచా రానికి సంబంధించి హృతిక్ రోషన్ కూడా హాజరవుతాడని వినిపిస్తుంది. ఆయన తెలుగు మీడియాకు కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ రకంగా యశ్ రాజ్ ఫిలింస్ హృతిక్ ని ఒప్పించినట్లు సమాచారం. హైదరాబాద్ లో ప్రచారం చేయడం హృతిక్ కొత్తేం కాదు. అయితే ఆ ప్రచారమంతా గంగ..రెండు గంటల్లో తేల్చేసి ముంబైకి వెళ్లిపోయేవారు.
పూర్తి స్థాయిలో తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భా లైతే లేదు. కానీ 'వార్ 2' భారీ ఎత్తున తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హృతిక్ ప్రచారం ఇక్కడా కీలకంగా ఉంటుందని భావించి రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో క్రిష్ ప్రాంచైజీని కూడా హృతిక్ హైదరాబాద్ లో బాగానే ప్రచారం చేసారు. ఆ ప్రాంచైజీ ఇండియాలో పెద్ద సక్సస్ అయిన సంగతి తెలిసిందే.