బంధుప్రీతిని నటవారసులను సమర్థించిన నిర్మాత
బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి విస్త్రతమైన చర్చ సాగుతోంది. నటవారసులు తెరకు పరిచయమవుతున్నా ప్రతిభను నిరూపించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.
By: Sivaji Kontham | 7 Nov 2025 4:00 AM ISTబాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి విస్త్రతమైన చర్చ సాగుతోంది. నటవారసులు తెరకు పరిచయమవుతున్నా ప్రతిభను నిరూపించలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. నెపో కిడ్స్ కారణంగా ప్రతిభావంతులు అవకాశాలు కోల్పోతున్నారని కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటవారసులే లక్ష్యంగా కంగన లాంటి వాళ్లు నిరంతరం ఘాటైన వ్యాఖ్యలతో చెలరేగడం చర్చగా మారుతోంది.
అయితే ఎవరు ఎలా ఉన్నా, తాను మాత్రం నటవారసులకు మద్ధతుగా నిలుస్తానని చెబుతున్నారు షారూఖ్ ఖాన్ స్నేహితుడు, వెటరన్ నిర్మాత వివేక్ వాస్వానీ. ప్రపంచం మొత్తం బంధు ప్రీతిని వ్యతిరేకిస్తుంటే, సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కెరీర్ ప్రారంభంలో కీలక సహకారం అందించిన నిర్మాత - నటుడు వివేక్ వాస్వానీ ఎప్పటికీ తాను ఖాన్‌కి మద్ధతుగా నిలుస్తానని అన్నారు.
షారూఖ్ ఖాన్ వారసులు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ లకు సహాయం చేయడానికి తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నాడు. ఒక తండ్రిగా షారూఖ్ తన పిల్లలకు అండగా నిలవడాన్ని ఆయన సమర్థించారు. తర్వాతి తరానికి సహాయం చేయడం ఒక హక్కు కాదు.. కుటుంబంలో సహజ పురోగతికి మార్గదర్శకత్వం వహించడమని అన్నారు. షారూఖ్ తన పిల్లలకు సహాయం చేయడం మార్గదర్శకత్వం వహించడం తప్పు కాదనేది నా అభిప్రాయమని అస్రానీ అన్నారు.
నా స్నేహితుడు షారుఖ్ కోసం నేను సహాయం ఎందుకు చేయకూడదు? ఆయన పిల్లల బాధ్యతను నాకు ఇస్తే నేను ఎందుకు చూడకూడదు. నేను ఎలాంటి సహాయానికైనా సిద్ధం. నేటితరం ముందుకు వెళుతుంటే ప్రోత్సహించాలి కానీ కాళ్లు పట్టి లాగకూడదు. యువతరాన్ని నిలబెట్టే బాధ్యత మనకు ఉంది. ఆర్యన్, సుహానా కోసం ఏదైనా చేయమని షారూఖ్ నన్ను అడిగితే నేను వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను! అని అన్నారు. ది ఆర్చీస్ లో సుహానా బాగానే నటించిందని నాకు అనిపించింది. ది బా**డ్స్ ఆఫ్ బాలీవుడ్` సిరీస్ తో ఆర్యన్ నిరూపించాడని భావిస్తున్నాను. నేను వారికి పూర్తి మద్ధతునిస్తున్నాను అని అతడు అన్నారు. మేము పిల్లలకు మద్ధతునిస్తాము.. వారు తప్పులు చేస్తారు.. పడి లేస్తారు.. ఎదుగుతారు! అని అన్నారు.
షారూఖ్ ఖాన్‌తో వివేక్ వాస్వానీ అనుబంధం ఈనాటిది కాదు. ఖాన్ ఎదుగుదల ఆద్యంతం అతడు ఉన్నాడు. అతడి ఎదుగుదలకు వివేక్ సహకారం ఎప్పటికీ మరువలేనిది. తెల్లవారి 2 గంటలకు ఫోన్ చేస్తే తాను ఖాన్ తో ఉంటానని, ఖాన్ కూడా ఎలాంటి సమయంలో అయినా తనకోసం వస్తాడని వివేక్ అస్రానీ చెప్పారు. అలాంటి గొప్ప స్నేహం మా మధ్య ఉందని కూడా ఆయన అన్నారు. షారూఖ్ పిల్లల్లో ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలో ఒక విజయవంతమైన డైరెక్టర్ గా దూసుకెళ్లాలని ఆశిస్తే, సుహానా ఖాన్ నటనలో తన తండ్రి లెగసీని ముందుకు నడిపించాలని ఉవ్విళ్లూరుతున్న సంగతి తెలిసిందే.
