Begin typing your search above and press return to search.

డబ్బులు రాకుండా సినిమా హిట్ అంటే ఎలా?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదల అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Jun 2025 11:56 PM IST
డబ్బులు రాకుండా సినిమా హిట్ అంటే ఎలా?
X

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదల అయిన విషయం తెలిసిందే. పరమశివుడి మహాభక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా మైథలాజికల్ డ్రామాగా మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. కథ అందించిన స్క్రీన్ ప్లే బాధ్యతలను కూడా నిర్వర్తించారు.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై కన్నప్ప మూవీని మోహన్ బాబు నిర్మించారు. సినిమాలో ఆయన కీలక పాత్ర కూడా పోషించారు. మోహన్ బాబుతోపాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, శరత్ కుమార్, మధుబాల, ప్రీతి ముకుందన్, సప్తగిరి, ముకేశ్‌ రుషి, బ్రహ్మాజీ తదితరులు నటించారు.

మొత్తానికి సినిమా కోసం భారీ స్టార్ క్యాస్టింగ్ ను రంగంలోకి దించారనే చెప్పాలి. స్టీఫెన్ దేవస్సీ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అయితే జూన్ 27వ తేదీన సినిమా రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విష్ణు యాక్టింగ్ సూపర్ అని అంతా కొనియాడుతున్నారు. నెవ్వర్ బిఫోర్ అనేలా నటించారని కామెంట్లు పెడుతున్నారు.

ప్రభాస్ పోషించిన రుద్ర క్యారెక్టర్ కూడా సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. సినిమాలో ఉన్న చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ను డార్లింగ్ రోల్ కవర్ చేసిందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ఆలోచింపజేసేలా ఉందని రివ్యూస్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పకపోయినా.. కన్నప్ప ప్లాఫ్ మాత్రం కాదని అంటున్నారు.

ముఖ్యంగా విష్ణు నటించిన గత సినిమాల టైమ్ లో ట్రోల్స్ మామూలుగా రాలేదు. కానీ ఇప్పుడు ఎలాంటి ట్రోల్స్ లేకపోవడం గమనార్హం. అలా మూవీ ఆడియన్స్ కు నచ్చిందనే చెప్పాలి. హిట్ టాక్ కూడా అందుకున్నట్లు కనిపిస్తుంది. అయితే వసూళ్ల సంగతేంటి? సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ పూర్తవుతుందా? ఇప్పుడిదే క్వశ్చన్ మార్క్.

ఏ సినిమా అయినా.. ఎలాంటి టాక్ వచ్చినా వసూళ్లు వస్తే హిట్ అయినట్లు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకుంటే విజయం సాధించినట్లు. ఆ తర్వాత ఎంత రాబట్టినా అవన్నీ లాభాలే. దాన్ని బట్టి సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్ హిట్ అంటుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కన్నప్ప వసూళ్లు, బడ్జెట్ విషయానికొస్తే..

నిజానికి మూవీని న్యూజిలాండ్ లోనే ఎక్కువ షూట్ చేశారు. కాబట్టి బడ్జెట్ ఎక్కువే అయింటుంది. కరెక్ట్ ఫిగర్ ను రివీల్ చేయకపోయినా.. పెద్ద నెంబర్ అని మంచు విష్ణు పలుమార్లుప్రమోషన్స్ లో తెలిపారు. భారీ బడ్జెట్ తో సినిమా తీశామని చెప్పారు. త్రిబుల్ డిజిట్ నెంబర్ అని కూడా పేర్కొన్నారు. దీంతో అంతా 200 కోట్ల బడ్జెట్ అని అంతా ఫిక్సయ్యారు!

ఇప్పుడు ప్రభాస్ ను సినిమాలోకి తీసుకుని.. మంచి ఓపెనింగ్సే తెచ్చుకున్నారు మేకర్స్. ఫస్ట్ డే రూ.20 కోట్లకు పైగా కన్నప్ప మూవీ.. వరల్డ్ వైడ్ గా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో మంచి వసూళ్లే వస్తున్నట్లు సమాచారం. ఇంకా రెండో రోజు వసూళ్లపై వార్తలతోపాటు ఊహాగానాలు వస్తున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

ఏదేమైనా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేస్తేనే కన్నప్ప హిట్ అయినట్లు. మరి ఆ సినిమా టార్గెట్ ను అందుకుంటుందా? భారీ బడ్జెట్ పెట్టిన మేకర్స్ కు ఊరటనిస్తుందా? టాక్ మంచిగానే ఉన్నా.. వరల్డ్ వైడ్ గా సాలిడ్ వసూళ్లు రాబడుతుందా? పెట్టిన డబ్బులు నిర్మాతలకు వచ్చేస్తాయా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.