Begin typing your search above and press return to search.

ప్రభాస్, రణవీర్.. వెనక్కి తగ్గక తప్పట్లేదు!

బాలీవుడ్‌లో విలక్షణ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విశాల్ భారద్వాజ్ ఇప్పుడు తన కొత్త సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 July 2025 2:00 PM IST
ప్రభాస్, రణవీర్.. వెనక్కి తగ్గక తప్పట్లేదు!
X

బాలీవుడ్‌లో విలక్షణ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విశాల్ భారద్వాజ్ ఇప్పుడు తన కొత్త సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా రోమియో, మొదటిగా 2025 డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, తాజాగా అది వాయిదా పడింది. ఈ సినిమా విషయంలో మొదట నుంచే కాస్టింగ్ నుంచి టైటిల్ వరకూ అనేక మార్పులు జరిగినట్టు సమాచారం.

ప్రస్తుతం అందరిలో ఆసక్తి కలిగించిన విషయం ఏంటంటే.. రోమియో చిత్రం విడుదల తేదీని మార్చడం. అదే రోజు ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్, రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న ధురంధర్ సినిమాలు విడుదల కానున్నాయి. రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతుండగా, విశాల్ భారద్వాజ్ తన సినిమా కమర్షియల్ గా బిజినెస్ పరంగా దెబ్బ తినకూడదనే అభిప్రాయంతో వెనకడుగు వేసినట్టు టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్‌కు తెలుగు, హిందీ భాషల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అతని సినిమాలకు ఓపెనింగ్స్ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటాయి. ది రాజా సాబ్ టీజర్‌కు మిశ్రమ స్పందన వచ్చినా, బాక్సాఫీస్‌ వద్ద ఓ రేంజ్ ఓపెనింగ్ దక్కుతుందని అంచనా. అదే సమయంలో ధురంధర్ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య స్క్రీన్ కేటాయింపు విషయంలో పోటీ తీవ్రంగా ఉండటం, వాటి కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే రోమియో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

అయితే, విశాల్ భరద్వాజ్ సినిమాలు సాధారణ ప్రేక్షకులను కన్నా క్లాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తాయి. అలాంటి సమయంలో, ఇద్దరు స్టార్ హీరోల మాస్ సినిమాల మధ్యలో విడుదల చేయడం ఆర్థికంగా అతనికి సరైన ఛాన్స్ కాకపోవచ్చు. అందుకే రోమియోను 2026కి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఈ సినిమా మొదటగా కార్తిక్ ఆర్యన్‌తో రూపొందించాలని భావించారు. టైటిల్ కూడా అర్జున ఉస్తారాగా ఉండేది. కానీ తర్వాత ప్లాన్లు మారి, షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రీలను జోడీగా ఫిక్స్ చేశారు. షాహిద్ గత రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో, ఈ సినిమా అతనికి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రోమియో విడుదల డేట్ పోస్ట్ పోన్ కావడంతో, అతనికి సరైన ప్లాన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. మరి ఈ సినిమా ఆడియెన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.