Begin typing your search above and press return to search.

టైటిల్ కాదు.. కంటెంట్ చూడండి..!

ట్రైలర్ ఇంకా ప్రమోషనల్ కంటెంట్ చూసి ఇదేదో అడల్ట్ మూవీ అనుకుంటారు కానీ సినిమాలోపల ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని అన్నారు.

By:  Tupaki Desk   |   8 July 2025 6:45 PM IST
టైటిల్ కాదు.. కంటెంట్ చూడండి..!
X

యువ టీంతో కొత్త ప్రయత్నాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు సినీ మేకర్స్. ఈ క్రమంలో ఒక కొత్త టీం అంతా కలిసి వర్జిన్ బాయ్స్ అనే సినిమా చేశారు. గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని దయానంద్ డైరెక్ట్ చేయగా రాజ్ దారపునేని నిర్మించారు. ఈమధ్యనే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా సినిమా ఈ నెల 11న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో భాగంగా తుపాకి స్టూడియోకి వచ్చారు.. ఆ టీం తో ముచ్చటించి మరిన్ని విషయాలు ప్రేక్షకులకు తెలిసేలా చేశారు.

వర్జిన్ బాయ్స్ యూత్ ఆడియన్స్ కి నచ్చే సినిమా అవుతుందని అన్నారు నిర్మాత రాజ్. ట్రైలర్ ఇంకా ప్రమోషనల్ కంటెంట్ చూసి ఇదేదో అడల్ట్ మూవీ అనుకుంటారు కానీ సినిమాలోపల ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ, ఎమోషన్స్ అన్నీ ఉంటాయని అన్నారు. బిగ్ బాస్ ముందు తర్వాత కూడా తనకు ఒకేలా ఉందని మిత్రా శర్మ అన్నారు.

ఇవే కాదు వర్జిన్ బాయ్స్ సినిమా చూస్తే ఆడియన్స్ కి గిఫ్ట్స్ కూడా ఇస్తారన్నారు మేకర్స్. మరి ఇంతకీ వర్జిన్ బాయ్స్ గురించి టీం అంతా ఏం చెప్పారు. ఆ సినిమా గురించి చెప్పిన ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఏంటన్నది కింద ఇంటర్వ్యూలో చూసేయండి.