Begin typing your search above and press return to search.

'ది' ట్యాగ్ తో ఎక్కడలేని ఎదురు దెబ్బలు తగిలాయ్: విజయ్

వివిధ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడారు.

By:  Tupaki Desk   |   8 July 2025 11:18 AM IST
ది ట్యాగ్ తో ఎక్కడలేని ఎదురు దెబ్బలు తగిలాయ్: విజయ్
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు. చిట్ చాట్స్ నిర్వహిస్తుంటారు.

వివిధ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు మాట్లాడారు. ఆ సమయంలో తన పేరుకు ముందు యాడ్ చేసిన ది ట్యాగ్ విషయంపై క్లారిటీ ఇచ్చారు. దాన్ని తొలగించమని ఎందుకు చెప్పారో వివరించారు.

తన పేరుకు ది ట్యాగ్ యాడ్ చేయడం వల్ల మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిందని విజయ్ దేవరకొండ తెలిపారు. ముఖ్యంగా.. ఇండస్ట్రీ ఏ హీరోలు కూడా ఎదుర్కోని దెబ్బలు తనకు తగిలాయని అన్నారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో యూనివర్సల్‌ స్టార్‌ నుంచి పీపుల్స్‌ స్టార్‌ వరకు ఎన్నో ట్యాగ్స్‌ వచ్చాయని గుర్తు చేశారు.

వాటిని చాలా మంది హీరోలు యూజ్ చేసుకుంటున్నారని తెలిపారు. అంతేకాదు.. తన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి కూడా ట్యాగ్ ఉన్నాయని, దీంతో ఇండస్ట్రీలో ఏ ట్యాగ్ లేని హీరో తానేమోనని అన్నారు. కానీ తనకు ట్యాగ్ పై ఇంట్రెస్ట్ లేదని.. తనను ఎప్పుడూ యాక్టింగ్ తో అంతా గుర్తుంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.

అయితే ఫ్యాన్స్ తోపాటు ఆడియన్స్.. సెన్సేషనల్ స్టార్, రౌడీ స్టార్ తనను పిలిచేవారని గుర్తు చేశారు. కానీ తాను వాటిని యాక్సెప్ట్ చేయలేదని తెలిపారు. ఆ సమయంలో తన లైగర్ మూవీ టీమ్.. ది పదాన్ని యాడ్ చేసిందని స్పష్టం చేశారు. ఆ ట్యాగ్ ను ఎవరూ యూజ్ చేయకపోవడంతో.. తాను అందుకు ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

కానీ దానివల్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. అందుకే వెంటనే ది ట్యాగ్ ను తొలగించాలని సూచించినట్లు తెలిపారు. తనను ఎవరైనా విజయ్ దేవరకొండ అని పిలిస్తే చాలు అని అన్నారు. దానికి తాను ఒప్పుకుంటానని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ తో పాటు ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.