Begin typing your search above and press return to search.

విజయ్ ఎవరి కోసం అన్నారు? ఏం జరిగింది?

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నువ్విలా మూవీలో చిన్న క్యారెక్టర్ లో నటించి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో యాక్ట్ చేసి మెప్పించారు.

By:  Tupaki Desk   |   8 July 2025 3:22 PM IST
విజయ్ ఎవరి కోసం అన్నారు? ఏం జరిగింది?
X

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. నువ్విలా మూవీలో చిన్న క్యారెక్టర్ లో నటించి సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో యాక్ట్ చేసి మెప్పించారు. హీరోగా పెళ్ళి చూపులు సినిమాతో విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బిగ్గెస్ట్ హిట్ అందుకుని సత్తా చాటారు.

ఆ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో వేరే లెవెల్ లో హిట్ అందుకున్నారు. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేశారు. టాలీవుడ్ లోని స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం వివిధ సినిమాల్లో నటించి మెప్పించారు. మంచి హిట్స్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. సెన్సేషనల్ హీరోగా మారారు.

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్పై యాక్షన్ జోనర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. జులై 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది.

ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో సినీ వారసత్వం కుటుంబం నుంచి వచ్చిన స్టార్ కిడ్ లాగా స్క్రిప్ట్‌లలో మార్పులు అడగడానికి తనకు అధికారం లేదని వ్యాఖ్యానించారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఒకటికి రెండుసార్లు దాన్ని చెక్ చేసుకుని అవసరమైతే వేరే రచయితలను తీసుకొచ్చే అడ్వాంటేజ్ తనకు లేదని అన్నారు.

ఇప్పుడు తాను సొంతంగా మాట చెప్పే స్థాయికి చేరానని తెలిపారు విజయ్. ఒకవేళ స్టోరీ నచ్చకపోతే తాను వెంటనే నో చెబుతానని అన్నారు. మొత్తానికి విజయ్ నెపోటిజం గురించి మాట్లాడారని క్లియర్ గా తెలుస్తోంది. దీంతో ఆయన ఎవరి కోసం మాట్లాడారోనని డిస్కస్ చేసుకుంటున్నారు. పేరు చెప్పలేదు కానీ.. ఎవరి కోసమో మాత్రం అన్నారని అంటున్నారు.

అదే సమయంలో విజయ్ దేవరకొండ ఏ వ్యక్తిని లేదా ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకోలేదని అభిమానులు చెబుతున్నారు. సినీ నేపథ్యంతో స్థిరపడిన వ్యక్తులకు, లేనివారికి మధ్య ఉన్న సహజ వ్యత్యాసం గురించి ఆయన మాట్లాడారని అంటున్నారు. అందుకే తప్పుడు ప్రచారం చేయొద్దని, అనవసరమైన చర్చలు చేయడం కన్నా నిజం తెలుసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.