కింగ్ డమ్ లో కసెక్కించే సీన్లు ఉన్నాయా?
విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.
By: Tupaki Desk | 8 July 2025 10:00 PM ISTవిజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్ డమ్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఇంత వరకూ ఈ జానర్లో గౌతమ్ సినిమాలు చేయలేదు. తొలి రెండు చిత్రాలు క్లాసిక్ చిత్రాలు కావడంతో? కింగ్ డమ్ ని ఎలా డీల్ చేస్తున్నాడు? అన్న సందేహాలు చాలా మందిలో మొన్నటివరకూ ఉండేవి. కానీ ప్రచార చిత్రాల రిలీజ్ అనంతరం యాక్షన్ మేకింగ్ లోనూ గౌతమ్ పనితనం కనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లో హీరోని నెక్స్ట్ లెవల్ ల్లోనే హైలైట్ చేసాడు.
శ్రీలంక సరిహద్దుల్లోని శరణార్థుల నేపథ్యంలో సాగే కథ ఇది. 1947 నుంచి 40 ఏళ్ల కాలంలో జరిగిన కథ ఇది. ఇందులో విజయ్ దేవరకొండ నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. అణగారిన వర్గాల వారిని కాపాడే పాత్ర అది. ఈ కోణంలోనే ప్రచార చిత్రాలను పీక్స్ లో డిజైన్ చేసి వదిలారు. అవి ఆద్యంత ఆకట్టు కున్నాయి. విజయ్ భారీ హిట్ కొట్టేలా ఉన్నాడు? అనే బజ్ ని తీసుకొచ్చాయి. ఇంత వరకూ బాగానే ఉంది. మరి సినిమాలో రొమాంటిక్ విజయ్ కనిపించడా? అంటే అందుకు ఆస్కారం ఉందని చిత్ర వర్గాల నుంచి లీకులందుతున్నాయి.
విజయ్-భాగ్య శ్రీ మధ్య రొమాంటిక్ సన్నివేశాలకు ఏమాత్రం కొదవుండదట. ఇద్దరి మధ్య రొమాన్స్ ఘాటుగానే ఉంటుందట. ఇలాంటి సన్నివేశాల విషయంలో గౌతమ్ రాజీ పడే దర్శకుడు కాదు. గత చిత్రం జెర్సీలో నాని- శ్రద్దా శ్రీనాధ్ మధ్య రొమాన్స్ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో తెలిసిందే. ఎమోషనల్ గా ఆ చిత్రాన్ని ఎంత గొప్పగా కనెక్ట్ చేసాడా? ప్రధమార్తంలో అంతకు మంచి రొమాంటిక్ గానూ ఆ జోడీ తెరపై ఆవిష్కరించాడు.
అప్పటి వరకూ నాని ఏ సినిమాలోనూ ఆ రేంజ్ లో రొమాన్స్ పండించలేదు. మాలీవుడ్ నటి శ్రద్దా శ్రీనాధ్ కూడా ఏ హీరోతోనూ అంతకు మునుపెన్నడలు అలాంటి ఛాన్స్ తీసుకోలేదు. సినిమాలో ఆ సన్నివేశాలు పర్పెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కింగ్ డమ్ లోనూ అలాంటి రొమాన్స్ కనిపించేలా ఉంది. ఈ చిత్రాన్ని ఈనెలలోనే రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.