కింగ్డమ్.. విజయ్ మాస్టర్ క్లాస్ పీస్!
అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది.
By: Tupaki Desk | 8 July 2025 10:34 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. లైగర్ తో దారుణంగా నిరాశపరిచిన ఆయన.. ఫ్యామిలీ స్టార్ మూవీని మెప్పిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాతో కూడా ఫ్లాప్ అందుకున్నారు. ఇప్పుడు కింగ్డమ్ మూవీతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.
స్పై జోనర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కింగ్డమ్ లో భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జూలై 31వ తేదీన గ్రాండ్ గా మూవీని విడుదల చేయనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు సహా పలు విషయాల కారణంగా మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు విడుదల అవ్వనుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వనున్న కింగ్డమ్ లో విజయ్ దేవరకొండ.. గూఢచారిగా కనిపించనున్నారు. రెండు భాగాల్లో కింగ్డమ్ రానున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందని, విజయ్ గట్టి కమ్ బ్యాక్ ఇస్తారని అంత అంచనా వేస్తున్నారు. మూవీ కోసం సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో సినిమాలో విజయ్ దేవరకొండ అద్భుతమైన, మాస్టర్ క్లాస్ ప్రదర్శన ఇచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.. ఎపిక్ మూవీ తీశారని సమాచారం. సిల్వర్ స్క్రీన్ పై మూవీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా అదే విధంగా పోస్ట్ పెట్టారు.
అయితే రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ట్రెండింగ్ నెంబర్ 1 లో ఉంది. ప్రోమో చూసిన అనిరుధ్ రవిచందర్, కింగ్డమ్ ను "విజయ్ మాస్టర్ క్లాస్, గౌతమ్ ఎపిక్" అని ట్వీట్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. దర్శకుడు గౌతమ్ యాక్షన్ డ్రామాకు ప్రాణం పోశాడని, అనిరుధ్ అద్భుతమైన సంగీతంతో అది మరింత పెరిగిందని అన్నారు. అలా విజయ్ ట్వీట్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.