Begin typing your search above and press return to search.

కింగ్డమ్ డేట్ ఫిక్స్.. రికార్డులు తగలబెట్టే ప్లాన్..!

విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో సూపర్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.

By:  Tupaki Desk   |   7 July 2025 8:09 PM IST
కింగ్డమ్ డేట్ ఫిక్స్.. రికార్డులు తగలబెట్టే ప్లాన్..!
X

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా కింగ్డమ్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై మొన్నటిదాకా కన్ ఫ్యూజన్ ఏర్పడింది. జూన్, జూలై ఈ రెండు నెలల్లోనే సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. జూన్ 30 నుంచి సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ చెప్పలేదు. విజయ్ ఫ్యాన్స్ కింగ్డమ్ రిలీజ్ ఎప్పుడూ అంటూ ఎటాక్ చేయడం మొదలు పెట్టారు.

ఇన్ని విషయాల మధ్య ఫైనల్ గా కింగ్డమ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. జూలై 31న కింగ్డమ్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం ఒక టీజర్ ని కూడా వదిలారు మేకర్స్. కింగ్డమ్ సినిమాపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అంచనాలు పెంచింది.

విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో సూపర్ కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ తో అమ్మడి జోడీ కూడా అదిరిపోయేలా ఉంది. ఆల్రెడీ వీరిద్దరి మధ్య వచ్చిన ఒక సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. కింగ్డమ్ కి అనిరుద్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ అంటున్నారు. రిలీజైన సాంగ్స్, టీజర్ లో బిజిఎం అన్నీ కూడా అనిరుద్ మార్క్ ని చూపిస్తున్నాయి.

ఇక విజయ్ దేవరకొండ కింగ్డమ్ యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమా లో విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. తప్పకుండా ఫ్యాన్స్ కి ఒక మంచి మాస్ ఫీస్ట్ అందించేలా ఈ సినిమా ఉంటుందనిపిస్తుంది. జెర్సీ తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన సినిమాగా కింగ్డమ్ పై భారీ హైప్ ఉంది. మరి ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. విజయ్ దేవరకొండ మాత్రం కింగ్డమ్ తో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. టీజర్, సాంగ్స్ లోని మాస్ కంటెంట్ చూస్తే నిజంగానే విజయ్ కోరుకునేలా సూపర్ హిట్ కాదు కాదు బ్లాక్ బస్టర్ వైబ్ కనిపిస్తుంది.