కింగ్‌డమ్ లో రాణి ఎవరంటే..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా కింగ్‌డమ్. నేషనల్ అవార్డ్ విన్నర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ చాలా కొత్తగా కనిపించనున్నాడు.
By: Tupaki Desk | 29 April 2025 9:49 PM ISTరౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా కింగ్‌డమ్. నేషనల్ అవార్డ్ విన్నర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మే ఆఖరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమో అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 30న కింగ్‌డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ కానుంది. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ మరియు ఒక యువతి రైల్వే స్టేషన్ లో బెంచ్ మీద కూర్చుని, ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ ను చూస్తూ ఉన్నారు.
అయితే పోస్టర్ ఎప్పుడైతే రిలీజైందో అప్పట్నుంచి నెటిజన్లు ఆ పోస్టర్ చూసి విజయ్ పక్కన కూర్చున్న హీరోయిన్ ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. X లో గ్రోక్ లాంటి ఏఐ అసిస్టెంట్లను ట్యాగ్ చేసి మరీ విజయ్ పక్కన కూర్చున్న భామ ఎవరు అని అడగడం మొదలుపెట్టారు. అయితే కింగ్‌డమ్ మేకర్స్ ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తుందన్న విషయాన్ని ఎట్టకేలకు నిన్న వెల్లడించారు.
భాగ్యశ్రీ కూడా తన ఇన్‌స్టా స్టోరీలను కింగ్‌డమ్ పోస్టర్లతో నింపేస్తూ ఈ మూవీలో తనే హీరోయిన్ అనే విషయాన్ని ధృవీకరించింది. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటించి ఆ సినిమాలో తన లుక్స్, యాక్టింగ్ తో అందరినీ మెప్పించిన భాగ్యశ్రీ బోర్సే టాలెంట్ ను గుర్తించే మేకర్స్ ఆమెకు కింగ్‌డమ్ లో ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ సినిమా అయినా భాగ్యశ్రీకి మంచి ఫలితాన్నిస్తుందేమో చూడాలి.