విజయ్ స్టార్ పవర్ వల్ల 'కింగ్ డమ్' కలెక్షన్స్ ఇలా!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 6 Aug 2025 12:45 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అన్నదమ్ముల కథతో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాతో ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు విజయ్. జులై 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలవ్వగా.. తన యాక్టింగ్ తో మెప్పించారు.
సినిమాలో కానిస్టేబుల్ సూరిగా నటించిన విజయ్.. తనలో ఎంత మంచి నటుడు ఉన్నారో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. సూరి రోల్ లో ఒదిగిపోయారు. సినిమాలో మొత్తం మూడు కోణాల్లో కనిపించగా.. ప్రతి యాంగిల్ లో అదరగొట్టారు. స్పైగా మారిపోయాక తన యాక్టింగ్ తో ఫిదా చేశారు. యాక్షన్స్ సీన్స్ లో వార్వెవా అనిపించారు.
అదే సమయంలో తన స్టార్ పవర్ తో ఇప్పుడు సినిమాను ముందుకు తీసుకెళ్తున్నారు. బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉన్నప్పటికీ సినిమాకు మంచి వసూళ్లు వచ్చేలా చేస్తున్నారు. మూవీకి కాస్త మిక్స్ డ్ టాక్ ఉన్నప్పటికీ.. తన క్రేజ్ తో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టేలా చేశారు. అన్ని లాంగ్వేజ్ లో కూడా విజయ్ దేవరకొండ తన ఇంపాక్ట్ ను చూపిస్తున్నారు.
నిజానికి కింగ్ డమ్ తొలిరోజు.. వరల్డ్ వైడ్ గా రూ.39 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అదంతా విజయ్ స్టార్ డమ్ వల్లే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఆ తర్వాత రెండో రోజు సినిమా వసూళ్లు కొంచెం డ్రాప్ అయ్యాయి. కానీ సాలిడ్ నెంబర్స్ నమోదవుతున్నాయి. అది కూడా విజయ్ దేవరకొండ వల్లనే అని చెప్పాలి.
బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదుర్కొంటున్నప్పటికీ.. విజయ్ ఇంపాక్ట్ తో మూవీ మంచి కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా సినిమాపై ఇతర ప్రధాన చిత్రాల విడుదలలు ప్రభావం చూపాయి. వారం ముందే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు రిలీజ్ అయింది. యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ సర్ప్రైజ్ హిట్ అయింది.
చిన్న మూవీగా విడుదలై పెద్ద విజయం సాధించింది. సూపర్ సక్సెస్ అయింది. దీంతో కలెక్షన్స్ డివైడ్ అయిపోయాయి. వచ్చే వారం కూలీ, వార్-2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అదే సమయంలో యూఎస్ లో కూడా విజయ్ వల్ల కింగ్ డమ్ వసూళ్లు నిలబడ్డాయి. ఆయన భారీ ప్రజాదరణ వల్ల తమిళ, మలయాళ మార్కెట్లలో కూడా కింగ్ డమ్ సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. దీంతో విజయ్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయింది.