పిక్‌టాక్ : మెగా హీరో మామూలుగా పెంచట్లేదుగా..!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న హీరో వరుణ్ తేజ్.
By: Tupaki Desk | 24 Jun 2025 3:54 PM ISTమెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న హీరో వరుణ్ తేజ్. మెగా ట్యాగ్‌ను పెద్దగా వినియోగించుకోకుండా కెరీర్ ఆరంభం నుంచి చాలా కష్టపడుతూ ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కోసం కండలు పెంచాడు. ఆ కండలు కంటిన్యూ కావాలన్నా కూడా రెగ్యులర్‌గా గంటల తరబడి వర్కౌట్స్ చేస్తూ ఉండాలి. వరుణ్ తేజ్ తన ఫిజిక్‌తో అందరినీ సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను షేర్ చేశాడు. మిర్రర్ సెల్ఫీలో వరుణ్ తేజ్ ఫిజిక్ బాగుందని, అతడు కండలు పెంచాడని క్లీయర్‌గా తెలుస్తుందని కామెంట్స్ వస్తున్నాయి.
హీరోగా వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. అయితే గత ఏడాదిలో వచ్చిన మట్కా సినిమాలో విభిన్నమైన మేకోవర్‌లో కనిపించడం ద్వారా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. అంతే కాకుండా ఆ సినిమాలో యాక్టింగ్‌తోనూ మంచి పేరును సొంతం చేసుకున్నాడు. ఆకట్టుకునే కథ, కథనంతో ఆ సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న వరుణ్ తేజ్ కి నిరాశే మిగిలింది. మెగా ఫ్యాన్స్ సైతం మట్కా విషయంలో ఒకింత ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంకాస్త బెటర్‌గా సినిమాను చేస్తే బాగుండేది అనే అభిప్రాయంను వ్యక్తం చేశారు.
గత ఏడాది వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమాతో పాటు మట్కా వచ్చింది. రెండు సినిమాలు కమర్షియల్‌గా నిరాశను మిగిల్చాయి. అందుకే తదుపరి సినిమా విషయంలో చాలా నెలలు ఆలోచనలు చేశాడు. ఎన్నో కథలు విన్న తర్వాత ఈ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా మేర్లపాక గాంధీకి మంచి పేరు ఉంది. తప్పకుండా ఆయన దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కి హిట్ పడుతుందనే విశ్వాసంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. కమెడియన్ సత్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ చెప్పడంతో పాటు, అతడి కామెడీ ఈ సినిమాలో ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్పకనే చెప్పారు.
వరుణ్ తేజ్ 2019లో ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎఫ్ 3 సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత చేసిన గని, గాంఢీవదారీ అర్జున సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ఇలాంటి సమయంలో ఏ విషయంలోనూ అజాగ్రత్తగా ఉండకూడదు అనే ఉద్దేశంతో చాలా సీరియస్‌గా డైట్‌ను ఫాలో అవుతున్నాడు. అంతే కాకుండా ఫిజిక్ విషయంలో అస్సలు రాజీ పడకుండా ప్రతి రోజు గంటల తరబడి వర్కౌట్‌లు చేస్తున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్ ఆరంభం నుంచి కనిపించిన తీరుగా కాకుండా ఈ సినిమాలో విభిన్నంగా కనిపించడం కోసం ఈ కఠోర వర్కౌట్స్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. కండలు ఓ రేంజ్‌లో పెంచుతున్న వరుణ్ తేజ్‌కి ఏ మేరకు సక్సెస్ దక్కుతుంది అనేది చూడాలి.