కొత్త ఆవకాయ్.. చరణ్‌కు కంప్లైంట్ ఇచ్చిన ఉపాసన..!
తాజాగా ఉపాసన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో కొత్త ఆవకాయ్ మేకింగ్ వీడియో కనిపించగా, అందులో చాగంటి గారి ప్రవచనం వాయిస్ ఓవర్‌గా వినిపించింది.
By: Tupaki Desk | 24 Jun 2025 4:56 PM ISTమెగా కోడలు ఉపాసన రామచరణ్, తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తరచూ కుటుంబానికి సంబంధించిన సరదా విశేషాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌కు ఫన్ ఫీడ్ అందిస్తుంటారు. ముఖ్యంగా ఆమెకు ‘అత్తమాస్ కిచెన్’ బ్రాండ్‌తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ హోమ్ మేడ్ ఫుడ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, సెలెబ్రిటీలకు స్పెషల్ హ్యాండ్లివరీస్ చేస్తూ, వాళ్ల రివ్యూలను షేర్ చేయడంలో బిజీగా ఉన్నారు ఉపాసన.
తాజాగా ఉపాసన షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో కొత్త ఆవకాయ్ మేకింగ్ వీడియో కనిపించగా, అందులో చాగంటి గారి ప్రవచనం వాయిస్ ఓవర్‌గా వినిపించింది. అదే వీడియోలో మెగా ఫ్యామిలీ పెద్దలు సురేఖ, అంజనమ్మలు మాట్లాడుకుంటూ కనిపించారు. "కొత్త ఆవకాయ్ బాగుంది కానీ కొంచెం పులుపు తక్కువ అయితే బాగుండేది" అంటూ వారు చర్చించుకోవడం సరదాగా కనిపించింది.
ఈ వీడియోలో అత్తాకోడళ్ల మధ్య ఆవకాయ్ టేస్ట్‌పై చిన్న చర్చ మాదిరిగానే కనిపించినా, దీనిని ఉపాసన సరదాగా ఇది పెద్ద గొడవే అంటూ రామ్ చరణ్‌కి కంప్లైంట్ చేయడం ఫాలోవర్స్‌కి నవ్వులు పుట్టిస్తోంది. అంతేకాకుండా వీడియోలో సురేఖ గారు అందరికీ ప్రేమగా కొత్త ఆవకాయ్‌తో అన్నం ముద్దలు పెట్టడం హైలైట్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు "సో స్వీట్" అంటూ కామెంట్లతో రెస్పాండ్ అవుతున్నారు.
అత్తమాస్ కిచెన్ బ్రాండ్ స్థాయి ఇప్పుడు మరింత పెరిగింది. టాలీవుడ్ స్టార్స్‌కు స్పెషల్‌గా ప్రొడక్ట్స్ పంపే ఉపాసన.. వాళ్లు ఇచ్చే టేస్ట్ ఫీడ్‌బ్యాక్‌లను తిరిగి షేర్ చేస్తుంటారు. ఫలానా సెలెబ్రిటీకి పొంగలి నచ్చింది, ఇంకొకరికి పులిహోర ఫేవరెట్ అంటూ ఉపాసన కథనాలు పంచుకుంటూ బ్రాండ్‌కి మరింత చేరువ చేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే కుమార్తె క్లీంకార బర్త్ డే సందర్భంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఉపాసనతో కలిసి ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్లి వచ్చారు. క్లీంకార పేరుతో హైదరాబాద్ జూ పార్క్‌లో ఉన్న పులిని కూడా ఆమెకు చూపించిన విషయం తెలిసిందే. ఈ ఉదయం తిరిగొచ్చిన చరణ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.