Begin typing your search above and press return to search.

'రామ్ చరణ్ 200'.. నేమ్ ఫీడింగ్ సీక్రెట్ రివీల్ చేసిన ఉపాసన!

రామ్ చరణ్ - ఉపాసన (Ram Charan- Upasana).. స్వీట్ కపుల్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ జంటకి ఎంతో పాపులారిటీ ఉంది.

By:  Madhu Reddy   |   13 Aug 2025 8:12 PM IST
రామ్ చరణ్ 200.. నేమ్ ఫీడింగ్ సీక్రెట్ రివీల్ చేసిన ఉపాసన!
X

రామ్ చరణ్ - ఉపాసన (Ram Charan- Upasana).. స్వీట్ కపుల్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ జంటకి ఎంతో పాపులారిటీ ఉంది. అయితే రామ్ చరణ్ ఇండస్ట్రీకి సంబంధించినవాడే కానీ ఉపాసన మాత్రం ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని కుటుంబం నుండి వచ్చింది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉపాసనకి కూడా ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి. దానికి కారణం మెగా ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు.ఎప్పుడైతే మెగా ఫ్యామిలీలోకి కోడలుగా అడుగు పెట్టిందో అప్పటినుండి ఉపాసన దశ తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అంతకుముందు కూడా ఉపాసన గోల్డెన్ స్పూనే.. కానీ మెగా ఫ్యామిలీలోకి కోడలుగా రాకముందు ఉపాసన అంటే ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే మెగా ఫ్యామిలీలోకి అడుగు పెట్టిందో అప్పటి నుండి మెగా కోడలుగా దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అయితే అలాంటి ఉపాసన చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలు మోస్తుంది.

ఓవైపు అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) కి వైస్ చైర్మన్ గా బాధ్యతలు నెరవేరుస్తూనే.. మరోవైపు సామాజిక సేవ కూడా చేస్తుంది. ఎంతోమంది పేదవారికి సహాయం చేయడంలో ఉపాసన ముందుంటుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాసనకి ఒక కీలక బాధ్యత అప్పజెప్పింది. అదేంటంటే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో చైర్మన్గా నియమించింది. దీంతో ఉపాసనకు మరిన్ని బాధ్యతలు పెరిగాయి. ఓవైపు తనకున్న బాధ్యతలను నెరవేరుస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఉపాసన.. మరోవైపు తన ఫ్యామిలీని కూడా చక్కగా నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఓ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్తకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఉపాసనకి ఒక ప్రశ్న ఎదురైంది. మీ భర్త పేరుని మీ ఫోన్లో ఏమని సేవ్ చేసుకుంటారని ప్రశ్నించగా.. నా హీరో, హబ్బీ వంటి పదాలు కాకుండా "రామ్ చరణ్ 200" అనే పేరుతో సేవ్ చేసుకున్నానంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

అయితే ఉపాసన ఇచ్చిన ఆన్సర్ కి అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే భర్త పేరుని ఎవరైనా కాస్త వెరైటీగా స్పెషల్ గా సేవ్ చేసుకుంటారు. కానీ 'రామ్ చరణ్ 200' అని సేవ్ చేసుకోవడమేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే 'రామ్ చరణ్ 200' అని ఫోన్లో తన భర్త నెంబర్ ని సేవ్ చేసుకోవడానికి ఓ కారణం ఉంది అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. అదేంటంటే ..రామ్ చరణ్ ఇప్పటికే పలు కారణాల చేత 199 సిమ్ లను మార్చారట. ప్రస్తుతం రామ్ చరణ్ దగ్గర ఉంది 200వ సిమ్ అంట. అందుకే భర్త కొత్త సిమ్ కొన్నప్పుడల్లా ఆ నెంబర్ కి రామ్ చరణ్ అని పేరుతో పాటు నెంబరింగ్ ఇంచుకుంటూ వెళ్ళింది. అలా ప్రస్తుతం రామ్ చరణ్ దగ్గర ఉంది 200వ సిమ్ కాబట్టి రామ్ చరణ్ 200 అని సేవ్ చేసుకున్నట్టు ఉపాసన చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఉపాసన తన భర్త ఫోన్ నెంబర్ గురించి చెప్పిన ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

అలాగే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏంటని ప్రశ్నించగా.. అందరూ మగధీర (Magadheera)లేదా ఆర్ఆర్ఆర్(RRR) లేదా రంగస్థలం (Rangasthalam) వంటి సినిమాల పేర్లు చెబుతుందని ఊహించారు. కానీ ఈ సినిమాలు కాకుండా తనకి నాయక్(Naayak) సినిమా అంటే ఇష్టమని చెప్పి షాక్ ఇచ్చింది. అయితే నాయక్ సినిమా తనకి ఎందుకు స్పెషలో కూడా చెప్పింది. మా పెళ్లి తర్వాత నేను సందర్శించిన మొదటి సినిమా సెట్ నాయక్ కాబట్టి నాకు ఈ సినిమా అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది..