ప్రేమలో మునిగితే, తికమక అవడం ఖాయం
గత కొన్నాళ్లుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. విజయ్, త్రిష ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని పుకార్లు బాగా వస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Jun 2025 3:54 PM ISTగత కొన్నాళ్లుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. విజయ్, త్రిష ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారని పుకార్లు బాగా వస్తున్నాయి. ఆ పుకార్లకు తగ్గట్టుగానే త్రిష రీసెంట్ గా విజయ్ పుట్టినరోజున ఇద్దరూ కలిసి దిగిన ఓ స్పెషల్ ఫోటోను షేర్ చేస్తూ దానికి హగ్ ఎమోజీని జోడించి మరీ అతనికి విషెస్ తెలిపింది.
అక్కడితో అయిపోలేదు. త్రిష షేర్ చేసిన ఆ ఫోటోకు ఆమె తల్లి కూడా లవ్ సింబల్స్ ను యాడ్ చేసి ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది. దీంతో త్రిష, విజయ్ మధ్య ప్రేమ నడుస్తుంని అందరూ ఫిక్సై పోయారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పలుమార్లు మీడియాలో వార్తలొచ్చినప్పటికీ ఈ విషయంపై వారిద్దరూ ఎప్పుడూ ఖండించకపోవడం గమనార్హం.
అయితే ఈ రూమర్లపై ఇప్పుడు త్రిష ఇన్‌డైరెక్ట్ గా రెస్పాండ్ అయింది. ఇన్‌స్టాలో త్రిష ప్రేమపై ఓ ఓ స్టోరీ పెట్టగా ఇప్పుడు ఆ స్టోరీ హాట్ టాపిక్ గా మారింది. ప్రేమలో మునిగిపోతే, అది మిగిలిన అందరినీ తికమకకు గురిచేస్తుందని ఆ స్టోరీలో త్రిష పోస్ట్ చేసింది. త్రిష, విజయ్ ప్రేమలో ఉన్నారని వార్తలు ఎక్కువవుతున్న నేపథ్యంలోనే త్రిష ఈ స్టోరీ పెట్టిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే త్రిష, విజయ్ లవ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు. ఎప్పట్నుంచో ఈ గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ప్రయాణించడం, హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లికి గోవా వెళ్లడం కూడా ఆ వార్తలకు ఆజ్యం పోశాయి. త్రిష, విజయ్ కలిసి మొదటిసారిగా 2004లో గిల్లీ అనే సినిమాలో నటించగా, ఆ తర్వాత 2006లో ఆది అనే సినిమా చేశారు. రీసెంట్ గా లియో సినిమా చేయగా, గతేడాది విజయ్ నటించిన గోట్ సినిమాలో కూడా త్రిష స్పెషల్ సాంగ్ చేసింది. తన ఇన్నేళ్ల కెరీర్లో ఎప్పుడూ చేయని స్పెషల్ సాంగ్ కూడా త్రిష విజయ్ కోసమే చేసిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.