'బార్బరిక్' ట్రైలర్.. ఎలా ఉందంటే?
కంటెంట్ ఉండడంతోపాటు స్పెషల్ కాన్సెప్ట్ ఉండే సినిమాలను మూవీ లవర్స్ కచ్చితంగా ఆదరిస్తారన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 13 Aug 2025 5:33 PM ISTకంటెంట్ ఉండడంతోపాటు స్పెషల్ కాన్సెప్ట్ ఉండే సినిమాలను మూవీ లవర్స్ కచ్చితంగా ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. కొత్త పాయింట్ ను తీసుకుని.. సరికొత్తగా రూపొందించే సినిమాలను ఇప్పుడు అంతా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆ కోవకు చెందుతుంది త్రిబాణధారి బార్బరిక్ చిత్రం. మరికొద్ది రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ (బార్బరికుడు) పాత్ర ఆధారంగా రూపొందుతోంది త్రిబాణధారి బార్బరిక్ మూవీ. మోహన్ శ్రీవత్స దర్శకత్వం ఆ సినిమాను స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయపాల్ రెడ్డి అడిదల రిచ్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.
సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్ సహా పలువురు నటీనటులు సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతాన్ని అందిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుతున్నారు మేకర్స్.
అదే సమయంలో ఇప్పటికే మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశారు. పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ సహా ప్రమోషనల్ కంటెంట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. సత్య రాజ్, వశిష్ట, సత్యం రాజేష్ ఇలా ప్రతి ఒక్కరి పాత్రలకు ఎంత ప్రాముఖ్యత ఉందో క్లియర్ గా రివీల్ చేశారు. సత్యరాజ్ కనిపించిన తీరు మూవీకి హైలెట్ గా నిలిచేలా ఉంది.
విజువల్స్, ఆర్ఆర్, మేకింగ్ స్టాండర్డ్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ క్వాలిటీతో సినిమాను మేకర్స్ తీస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మూవీ విడుదల తేదీని మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.
చూడు బార్బరికా.. ఈ యుద్ధం నీది.. ధర్మధ్వజం రెపరెపలాడాలంటే.. ఆ ధర్మం చేసేవారికి దండన లభించాలి.. అంటూ శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్న సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత అప్పుడే ఓ యువతి నిద్రలో ఒక్కసారిగా భయపడి మేల్కొంటోంది. అనగనగా పూల తోట.. అందులో.. అంటూ లవ్ స్టోరీని రివీల్ చేశారు మేకర్స్.
నేను చెప్పిన కథలో తోటమాలి సామాన్యుడు అనుకుంటే పొరపాటే అంటూ బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ రాగా.. సత్యరాజ్, తన మనవరాలు ఓ సమాధి వద్ద కనిపిస్తారు. పోలీస్ ఆఫీసర్ గా వీటీవీ గణేష్.. మన కళ్ల ముందు పెరిగిన పిల్లలు చిన్నవాళ్లేలా కనిపిస్తారు. కానీ పెద్దవాళ్ళు అయ్యారని కొన్ని ఘటనలు గుర్తుచేస్తాయని చెబుతారు.
సత్యరాజ్ మనవరాలు మిస్ అవుతుంది. పేపర్స్ లో కూడా యాడ్స్ వేస్తారు. ఆమె కోసం వశిష్ట వెతుకుతారు. అప్పుడే నేను పాలల్లో నీరే కలుపుతా.. విషం కలప అంటూ ఉదయభాను పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత మిగతా పాత్రలను పరిచయం చేశారు. అయితే సత్యరాజ్ తన కుమార్తె కోసం బార్బరికుడుగా మారుతారు.
తన మనవరాలిని కాపాడుకుంటారు. ఆ సమయంలో ఏం జరిగిందనేది కథగా తెలుస్తోంది. ఓవరాల్ గా ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. సత్యరాజ్ తన పాత్రలో జీవించినట్లు కనిపిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ లో ఆయన టాలెంట్ క్లియర్ గా కనిపిస్తోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో ఉదయభాను అదరగొట్టేసిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
వీటీవీ గణేష్, సత్యం రాజేష్ సహా ప్రతి ఒక్కరూ తమ పాత్రలో ఒదిగిపోయి కనిపించారు. స్టోరీ చాలా ఎఫెక్టివ్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ విలువలు అయితే వావ్ అనేలా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించలేదు. కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా వర్క్, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. ప్రళయ మృత్యు భీకరం.. విలయ తాండవం అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పాట పవర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్ చూస్తే హార్ట్ అండ్ సోల్ పెట్టి డైరెక్టర్ మోహన్ శ్రీవత్స సినిమా తీసినట్లు ఉందని చెప్పడంలో అసలు ఆలోచించక్కర్లేదు.
ఇలాంటి సినిమాలు వచ్చి చాలా కాలమైందని చెప్పాలి. దీంతో బార్బరిక్ మూవీ కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ట్రైలర్.. సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మరి త్రిబాణధారి బార్బరిక్ చిత్రం ఎంతటి విజయం సాధిస్తుందో అంతా వేచి చూడాలి.