టాలీవుడ్ నెక్ట్స్ రీరిలీజులివే..
టాలీవుడ్ లో ఇప్పుడు రీరిలీజుల ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది. హిట్టు సినిమా, ఫ్లాపు సినిమా అని లేకుండా ప్రతీ సినిమానీ రీరిలీజ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 24 Jun 2025 11:48 AM ISTటాలీవుడ్ లో ఇప్పుడు రీరిలీజుల ట్రెండ్ మరీ ఎక్కువైపోయింది. హిట్టు సినిమా, ఫ్లాపు సినిమా అని లేకుండా ప్రతీ సినిమానీ రీరిలీజ్ చేస్తున్నారు. ఆడియన్స్ కూడా ఈ రీరిలీజులను ఎంజాయ్ చేస్తుండటంతో నిర్మాతలు వాటిపై ఫోకస్ చేసి సినిమాలను రీరిలీజ్ చేసి ఆడియన్స్ ఇష్టాన్ని, ఇప్పటి ట్రెండ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు సినిమాలు రీరిలీజవగా ఇప్పుడు మరికొన్ని సినిమాలు రీరిలీజ్ కు రెడీ అయ్యాయి. అవేంటో చూద్దాం.
హనుమాన్ జంక్షన్: హనుమాన్ జంక్షన్ సినిమా జూన్ 28న రీరిలీజ్ కానుంది. అర్జున్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతుంది. ఆడియన్స్ ఈ యాక్షన్ కామెడీ రీరిలీజ్ కోసం చాన్నాళ్లుగా వెయిట్ చేస్తున్నారు.
కుమారి 21F: రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా 2015లో రిలీజవగా అప్పట్లో ఆ సినిమా క్లైమాక్స్ సెన్సేషన్ సృష్టించింది. సినిమాలోని కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ కుమారి 21Fను తర్వాతి స్థాయికి తీసుకెళ్లగా ఇప్పుడు మరోసారి ఆ సినిమా జులై 10న రీరిలీజ్ కాబోతుంది.
మిరపకాయ్: మాస్ మహారాజా రవితేజ నటించిన మిరపకాయ్ సినిమా జులై 11న రీరిలీజ్ కానుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమాను మేకర్స్ రీరిలీజ్ చేస్తున్నారు.
గజిని: సూర్య హీరోగా నటించిన గజిని సినిమా జులై 18న రీరిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ను తమిళంలో తీసి, దాన్ని తెలుగులో డబ్ చేశారు. జులై 18న గజిని తెలుగు డబ్బింగ్ వెర్షన్ రీరిలీజ్ కాబోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ నిర్మించగా అప్పట్లో ఈ సినిమా మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఏ మాయ చేసావె: నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా జులై 18న రీరిలీజ్ కు రెడీ అవుతుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీ గా మిగిలింది. ఈ సినిమాతోనే సమంత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంటరై అందరి మనసుల్ని దోచేసింది.
వీడొక్కడే: సూర్య, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జులై 19న రీరిలీజ్ కాబోతుంది. కె. వి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 2009లో రిలీజై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా రీరిలీజ్ అవుతుంది.