Begin typing your search above and press return to search.

పాపం ఒక డైరెక్ట‌ర్‌

టాలీవుడ్ గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా గొప్ప‌లు చెప్పుకుంటుంటే మ‌న డైరెక్ట‌ర్లు మాత్రం హీరోల వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   16 May 2025 2:00 PM IST
Tollywood Directors Struggle as Star Heroes Delay Projects
X

టాలీవుడ్ గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా గొప్ప‌లు చెప్పుకుంటుంటే మ‌న డైరెక్ట‌ర్లు మాత్రం హీరోల వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. `బాహుబ‌లి`తో ప్ర‌పంచ సినిమా టాలీవుడ్ వైపు త‌లెత్తి చూసింది. దాంతో మ‌న సినిమాకు ప్ర‌పంచ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మార్కెట్ స్థాయి కూడా పెరిగింది. కానీ డైరెక్ట‌ర్లకు మాత్రం హీరోలు దొర‌క‌డం గ‌గ‌నంగా మారింది.

మ‌న మార్కెట్ స్థాయి పెరిగిన త‌రువాత హీరోలు పారితోషికాలు భారీగా పెంచేసి పాన్ ఇండియా అంటున్న విష‌యం తెలిసిందే. కొంత మంది భారీ సినిమా చేస్తే చాల‌నుకుంటున్నారు. కానీ డైరెక్ట‌ర్ల‌కు మాత్రం టైమ్ ఇవ్వ‌డం లేదు. ఓ ప‌ట్టాన ప్రాజెక్ట్‌ల‌ని ఓకే చేయ‌డం లేదు. చేస్తాం చేస్తాం అంటూ కాలం గ‌డిపేస్తున్నారు. దీంతో ఎన్నో ఆశ‌లు పెట్ట‌కున్న డైరెక్ట‌ర్ల కెరీర్ ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డుతోంది.

తాజాగా ఓ ద‌ర్శ‌కుడిని హీరోలు ఆడుకున్న స్టోరీ ఒక‌టి ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతోంది. మంచి సినిమా చేయాల‌ని క‌థ‌రాసుకుని ఓ హీరోని సంప్ర‌దించాడ‌ట ఓ డైరెక్ట‌ర్‌. అయితే స‌ద‌రు హీరో ఏమీ చెప్ప‌కుండా మూడు నెల‌లు త‌న చుట్టూ తిప్పించుకుని సినిమా చేస్తాన‌ని చెప్పి ఇప్పుడు తీరా టైమ్ వ‌చ్చేస‌రికి స‌ద‌రు హీరో డైరెక్ట‌ర్‌కు షాక్ ఇచ్చి ముఖం చాటేస్తున్నాడ‌ట‌. అస‌లు డైరెక్ట‌ర్ని ప‌ట్టించుకోవ‌ట్లేద‌ట‌.

ఇక ఓ హీరో గారి గ‌న‌కార్యం ఇలా ఉంటే మ‌రో హీరో ప్రొడ‌క్ష‌న్ హౌస్‌తో మాట్లాడి సినిమా చేద్దాం అని చెప్పి ఓ డైరెక్ట‌ర్ని తిప్పించుకుని, అత‌నికి లేనిపోని ఆశ‌లు క‌ల్పించి ఇప్పుడు చేయ‌న‌ని చెప్పి షాక్ ఇచ్చాడ‌ట‌. ఇది తెలిసిన కొంత మంది ఒక‌రి లైఫ్‌తో, ఒక‌రి ఎమోష‌న్స్‌తో ఆడుకుని చివ‌రికి వారిని ఇబ్బందుల‌కు గురి చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని, తెర‌పైనే కాదు తెర వెనుక నిజ‌జీవితంలోనూ హీరోగా హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కామెంట్ చేస్తెఉన్నాయి. డైరెక్ట‌ర్ ప‌రిస్థిని చూసి పాపం అని ఫీల‌వుతున్నాయి.