Begin typing your search above and press return to search.

బాబోయ్‌ బోయపాటి... సుకుమార్‌ తర్వాత స్థానం ఈయనదే!

టాలీవుడ్‌లో హీరోల, దర్శకుల పారితోషికాలు అమాంతం పెరిగాయి. రెండు దశాబ్దల ముందు వరకు సినిమా బడ్జెట్‌లు ఒక మోస్తరుగా ఉండేవి.

By:  Tupaki Desk   |   8 July 2025 11:14 AM IST
బాబోయ్‌ బోయపాటి... సుకుమార్‌ తర్వాత స్థానం ఈయనదే!
X

టాలీవుడ్‌లో హీరోల, దర్శకుల పారితోషికాలు అమాంతం పెరిగాయి. రెండు దశాబ్దల ముందు వరకు సినిమా బడ్జెట్‌లు ఒక మోస్తరుగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాల బడ్జెట్‌ మినిమం వంద కోట్లు ఉంటుంది, చిన్న హీరోల సినిమాలు, మీడియం రేంజ్‌ హీరోల సినిమాలు సైతం పాతిక నుంచి యాబై కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. బడ్జెట్‌లో మెజార్టీ భాగం హీరో, దర్శకుల పారితోషికాలుగా వెళ్లి పోతున్నాయి. టాలీవుడ్‌లో కొందరు హీరోలు ఏకంగా రూ.100 కోట్ల కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఇక దర్శకుల పారితోషికాలు ఆ స్థాయిలో లేకున్నా మునుపటి తో పోల్చితే పదుల రెట్లు పెరిగి హీరోల పారితోషికాలకు సమానంగా ఉంటున్నాయి.

తెలుగు దర్శకుల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుడు ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు రాజమౌళి. ఆయన హీరోల స్థాయిలో పారితోషికం అందుకుంటాడు అనడంలో సందేహం లేదు. మహేష్ బాబుతో ప్రస్తుతం ఆయన తీస్తున్న సినిమాకు అందుకుంటున్న పారితోషికం హాలీవుడ్‌ దర్శకులు అందుకునే పారితోషికం రేంజ్‌లో ఉందని టాక్‌. ఆ విషయం పక్కన పెడితే ఆ తర్వాత టాలీవుడ్‌లో సుకుమార్‌ అత్యధిక పారితోషికం అందుకుంటూ ఉంటాడు. పుష్ప సినిమా తర్వాత సుకుమార్‌ స్థాయి మరింతగా పెరిగింది. ఆయన పారితోషికం మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా పారితోషికాలు భారీగా అందుకుంటున్నారు.

దర్శకుడు సుకుమార్‌కి కాస్త తక్కువగా బోయపాటి శ్రీను పారితోషికం అందుకుంటున్నాడట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అందుతోంది. బాలకృష్ణతో ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న అఖండ 2 సినిమాకు గాను దాదాపు రూ.40 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటే హీరో బాలకృష్ణ పారితోషికం ఎంతో ఊహించుకోవచ్చు. అఖండ 2 సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో వీరిద్దరు అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. అంతే కాకుండా వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మూడు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే ఈ స్థాయి పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

అఖండ 2 సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. బోయపాటి, బాలకృష్ణ కాంబో అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అందుకే ఈ సినిమాకి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు కావడం ఖాయం. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఈ సినిమా నిలువబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అంతే కాకుండా ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.200 కోట్లను మించి వసూళ్లు సాధిస్తుందనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 నుంచి వచ్చిన టీజర్‌కి మంచి స్పందన దక్కింది. సనాతన ధర్మ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదే ఏడాది సెప్టెంబర్‌ 25న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో బాలయ్య, బోయపాటి డబుల్‌ హ్యాట్రిక్ కొట్టేనా చూడాలి.