ది ప్యారడైజ్ స్పార్క్ వీడియో.. జడల్ యాక్షన్ వేరే లెవెల్..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ది ప్యారడైజ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 11 Aug 2025 6:23 PM ISTటాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ది ప్యారడైజ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ ను ఎస్ ఎల్ వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ విలన్ గా నటిస్తున్నారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ తో కలిపి మొత్తం 8 భాషల్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 26న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.
సినిమాలో నాని నెవ్వర్ బిఫోర్ లుక్ లో ఇప్పటికే మేకర్స్ క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. జడల్ అనే పాత్రలో కనిపించనున్నట్లు రీసెంట్ గా వెల్లడించారు. ఇప్పుడు తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ సీక్వెన్స్ షూట్ చేయగా.. ఇప్పుడు సీక్వెన్స్ వ్రాప్ వీడియో స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్ పేరుతో గ్లింప్స్ ను సోమవారం సాయంత్రం రిలీజ్ చేశారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో జైలు వరల్డ్ నేపథ్యంలో 15 రోజుల పాటు షెడ్యూల్ ను నిర్వహించారు మేకర్స్. వీడియో ప్రకారం, జైలులో ఘర్షణ జరుగుతుంది. ఒంటరిగా, నిరాయుధుడిగా, నిస్సహాయంగా నాని కనిపిస్తారు. తోటి ఖైదీలు కత్తులతో దగ్గరగా వస్తారు. కానీ జడల్ కుర్చీలో కూర్చుని ధైర్యం ప్రదర్శిస్తారు. జడల్ ను పట్టుకుంటే సర్రమంటుంది అనే డైలాగ్ వినిపిస్తుంది. నాని మాత్రం వేరే లెవెల్ లో ఉన్నారు.
అయితే గ్లింప్స్ లో శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన విధానం వేరే లెవెల్ లో ఉంటుంది. సినిమా సాహసోపేతమైన దృష్టిని అంతా గమనించవచ్చు. షూటింగ్ విషయంలో చాలా క్లియర్ గా తన టాలెంట్ ను చూపిస్తూ వీడియోలో కనిపించారు. ఆయనకు ప్యారడైజ్ రెండో చిత్రమే అయినా.. అసలు అలా అనిపించలేదు.
అదే సమయంలో ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఎలక్ట్రిఫికేటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్ కు మెయిన్ అసెట్ గా మారింది. ప్రతి ఫ్రేమ్ కు ఆయన అందించిన మ్యూజిక్ కరెక్ట్ గా సెట్ అయింది. మరి కంప్లీట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ది ప్యారడైజ్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.