Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాలకు తమ్ముడు ఎఫెక్ట్..?

కానీ సినిమా రిలీజైన రోజే థియేటర్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. దిల్ రాజు కూడా తమ్ముడు భారీ లాస్ అని ఫిక్స్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   8 July 2025 10:32 PM IST
ఆ రెండు సినిమాలకు తమ్ముడు ఎఫెక్ట్..?
X

నితిన్ తమ్ముడు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దిల్ రాజుకి ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. అఫ్కోర్స్ సినిమాల్లో ఏది హిట్టు ఏది ఫట్టు అన్నది రిలీజ్ ముందే చెప్పడం కష్టం. కానీ దిల్ రాజు ఎందుకో తమ్ముడు సినిమాను బాగా నమ్మాడు. శ్రీరామ్ వేణు తీసిన సినిమాలన్నీ మరీ అంత దారుణంగా పోయినవి ఏమి లేవు. తమ్ముడు భారీ అంచనాలతో రిలీజైన ఒకవేళ మా అంటే యావరేజ్ గా పెట్టిన దానికి సమానంగా వచ్చేస్తుందని అనుకున్నారు.

కానీ సినిమా రిలీజైన రోజే థియేటర్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. దిల్ రాజు కూడా తమ్ముడు భారీ లాస్ అని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాకు ముందే ఇక మీదట తాను ఫేక్ కలెక్షన్స్, ఫేక్ పోస్టర్ వేయనని చెప్పారు దిల్ రాజు. ఇదిలా ఉంటే దిల్ రాజు తమ్ముడు సినిమా రిజల్ట్ వల్ల ఆయన తీయబోతున్న నెక్స్ట్ సినిమాల మీద ఎఫెక్ట్ పడేలా ఉంది. దిల్ రాజు నెక్స్ట్ విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్నారు.

రవికిరణ్ కోలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక దీనితో పాటుగా వేణు చేస్తున్న ఎల్లమ్మ మీద కూడా మరింత తమ్ముడు ఇంపాక్ట్ ఉండేలా ఉంది. ఎందుకంటే ఎల్లమ్మ సినిమాలో కూడా నితిన్ హీరోగా చేస్తున్నాడు. సో తమ్ముడు హిట్టైతే ఆ జోష్ తో ఎల్లమ్మ చేసే వారు. కానీ ఆ సినిమా నిరాశ పరచడంతో ఎల్లమ్మ టీం ఇంకాస్త జాగ్రత్తగా ఎల్లమ్మ చేయాల్సి ఉంటుంది.

ఐతే ఎల్లమ్మ విషయంలో దిల్ రాజు పునరాలోచనలో పడతాడా లేదా ఏదైతే అది అయ్యింది అన్నట్టుగా వెళ్తాడా అన్నది చూడాలి. ఏది ఏమైనా హిట్ సినిమా వస్తే ఏమవ్వదు కానీ భారీ బడ్జెట్ తో సినిమా చేసి అది కాస్త ఫ్లాప్ అయితే ఆ బ్యానర్ నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమాల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. మరి దిల్ రాజు వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారన్నది చూడాలి. ఈ ఇయర్ మొదట్లోనే రాం చరణ్ గేం ఛేంజర్ వల్ల భారీ లాస్ ఫేస్ చేసిన దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం తో దానికి కొంత రికవరీ చేసుకున్నాడు. మరి తమ్ముడు లాసులను రాబోతున్న సినిమాలతో కూడా రికవర్ చేసుకుంటారా లేదా అన్నది చూడాలి.