దళపతి స్థానాన్ని భర్తీ చేసేదెవరు?
రాజకీయాల్లోకి రావాలని ప్రేక్షకాభిమానులు కోరడంతోనే రంగంలోకి దిగుతున్నాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
By: Tupaki Desk | 8 July 2025 7:00 AM IST`జన నాయగన్` రిలీజ్ అనంతరం దళపతి విజయ్ రాజకీయాల్లో బిజీ అయిపోతాడు. ఇదే తన చిట్ట చివరి చిత్రంగా ఇప్పటికే ప్రకటించాడు. మరో సినిమా చేసే అవకాశం ఎంతమాత్రం లేదని తాజా సన్నివేశం చూస్తుంటే అర్దమవుతుంది. తమిళనాడు లో రాజకీయ వాతావరణం కూడా అంతకంతకు వెడెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇంకా మ్యాకప్ వేసుకుని అక్కడే కూర్చుంటే పనవ్వదని భావించిన విజయ్ ఎంత త్వరగా జనాల్లోకి వెళ్దామా? అని వెయిట్ చేస్తున్నాడు.
జమిలి ఎన్నికల్లో బరిలోకి దిగుతాడా? లేదా? అన్నది పక్కన బెడితే విజయ్ ప్లానింగ్ మాత్రంఓ ప్రణాళిక ప్రకారం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలి అనే ఎజెండాతోనే బరిలోకి దిగుతున్నాడనే ప్రచారం రోజు రోజుకి బలపడుతుంది. ఒకవేళ ఇదే జరిగి విజయ్ మళ్లీ సినిమాలు చేయకపోతే గనుక ఆ స్థానాన్ని ఏ నటుడు భర్తీ చేస్తాడు? అన్నది అంతే ఆసక్తికరం. నటుడి గా విజయ్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు. తమిళనాడు వ్యాప్తంగా అశేష జనాధారణ ఉన్న నటుడు. కోట్లాది మంది అభిమానించే తార.
రాజకీయాల్లోకి రావాలని ప్రేక్షకాభిమానులు కోరడంతోనే రంగంలోకి దిగుతున్నాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందులో మాస్ ఇమేజ్ లో విజయ్ పీక్స్ కు చేరిన నటుడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి ఛరిష్మా విజయ్ కి మాత్రమే సాధ్యమైంది. అలాంటి నటుడి స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాదు. తల అజిత్ కు ఆ ఛాన్స్ అన్ని రకాలు గా ఉంది. కానీ అతడు సినిమాలంటే అనాసక్తిగా పని చేస్తున్నారు. ఆ తర్వాత రేసులో మాత్రం కొంత మంది నటులు కనిపిస్తున్నారు.
సూర్య, ధనుష్, కార్తీ లాంటి వారున్నారు. కానీ దళపతి అంత గొప్ప క్రేజ్ ని సొంతం చేసుకుంటారా అన్నది వాళ్ల సక్సెస్ ను బట్టి ఉంటుంది. సూర్యకి క్లాస్ తో పాటు మాస్ ఇమేజ్ ఉంది. కానీ సూర్య వరుస ప్లాప్ ల్లో ఉన్నాడు. వాటిని జయించి కెరీర్ ని మరింత స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోవాలి. ఇక ధనుష్ కి మాస్ లో క్రేజ్ తక్కువ. మాస్ లో అతడు మరింత బలపడాలి. కార్తీ ఇంకా ఇండస్ట్రీలో సాధించాల్సింది చాలా ఉంది. మరి భవిష్యత్ లో విజయ్ స్థానాన్ని ఎవరు ముందుగా అందుకుంటారో చూడాలి.