ఖాకీ చేతిలో కత్తి
కోలీవుడ్ లో దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు.
By: Tupaki Desk | 22 Jun 2025 11:54 AM ISTకోలీవుడ్ లో దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లే ముందు విజయ్ ఆఖరిగా ఓ సినిమా చేస్తున్నాడు. అదే జన నాయగన్. హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
విజయ్ ఆఖరి సినిమా కావడంతో ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ డైరెక్టర్ వినోత్ తెరకెక్కిస్తున్నాడు. ఆదివారం విజయ్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఫస్ట్ రోర్ పేరిట మేకర్స్ ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశారు. జన నాయగన్ ఫస్ట్ రోర్ విజయ్ ఫ్యాన్స్ లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ ఫస్ట్ రోర్ లో విజయ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.
నిజమైన నాయకుడు అధికారం కోసం కాదు, ప్రజల కోసం వస్తాడు అనే క్యాప్షన్ తో మొదలైన ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. విజయ్ ఖాకీ డ్రెస్ లో కత్తిని చేతిలో పట్టుకుని స్టైలిష్ గా నడుచుకుంటూ రావడం, దానికి అనిరుధ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం చూసి విజయ్ ఫ్యాన్స్ మామూలు జోష్ లో లేరు. వీడియో చివరలో విజయ్ కత్తితో తన మీసాన్ని తిప్పే షాట్ వావ్ అనిపించేలా ఉంది. మొత్తానికి జన నాయగన్ టీమ్ విజయ్ బర్త్ డే కు ఇచ్చిన ట్రీట్ అందరినీ ఆకట్టుకుంటుంది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. జన నాయగన్ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా భగవంత్ కేసరికి రీమేక్ గా తెరకెక్కుతుందని ఎప్పట్నుంచో వార్తలొస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం అదేమీ లేదని కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు టీజర్ లో భగవంత్ కేసరి ఛాయలు కనిపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.