విజయ్ ‘జననాయగన్’ బిజినెస్.. ఇదెక్కడి డిమాండ్ సామీ!
ఇప్పుడు ‘జననాయగన్’ ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు రెడీ అవుతోంది. విజయ్ ఇప్పటికే పాలిటిక్స్ తో బిజీ అయ్యాడు.
By: Tupaki Desk | 22 April 2025 10:25 AM ISTతమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ సమరానికి ముందు చేస్తున్న చివరి సినిమా ‘జననాయగన్’. ఈ సినిమాపై ఫ్యాన్స్ లోనే కాదు, బిజినెస్ వర్గాల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయ్ గత సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా మార్కెట్ లో మంచి బిజినెస్ చేశాయి. ఇక పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘జననాయగన్’ ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు రెడీ అవుతోంది. విజయ్ ఇప్పటికే పాలిటిక్స్ తో బిజీ అయ్యాడు. ఇక ఇదే చివరి సినిమా అంటున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకంగా చూడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే షూటింగ్ ఫినిష్ కాకముందే ఈ సినిమా ఓటిటి, శాటిలైట్, ఆడియో, థియేట్రికల్ హక్కులకు ఇప్పుడే భారీ బిడ్ లు వస్తున్నాయంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థమవుతోంది.
తాజా సమాచారం ప్రకారం ‘జననాయగన్’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.121 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. విజయ్ గత సినిమాల రైట్స్ ను కూడా ఇదే అమెజాన్ భారీ ధరకు తీసుకుంది. కానీ ఈసారి ఫైనల్ సినిమాగా ఉండటం, ప్రేక్షకుల్లో ఉన్న భారీ హైప్ వలన ఈ రేటు దక్కినట్లు తెలుస్తోంది. ఇది సౌత్ సినిమాల డిజిటల్ హిస్టరీలో ఒక రికార్డ్ స్థాయి డీల్ గా చెబుతున్నారు.
అంతే కాదు, ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు కూడా భారీ మొత్తానికి వెళ్లాయి. సన్ నెట్‌వర్క్ రూ.55 కోట్లకు ఈ హక్కులను దక్కించుకుందని సమాచారం. విజయ్ సినిమాలకు తమిళంలో మంచి టీవీ టీఆర్పీ ఉండటంతో ఈ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక థియేట్రికల్ హక్కుల విషయంలో రోమియో పిక్చర్స్ రాహుల్ దాదాపు రూ.90 కోట్లకు ఈ డీల్‌ను లాక్ చేసినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా కేవలం తమిళనాడు రైట్స్ అని తెలుస్తోంది.
ఆడియో హక్కుల విషయంలో దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న టీ సిరీస్ సంస్థ ముందుకొచ్చింది. ఇప్పటికే విజయ్ సినిమాల్లోని పాటలు యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్ సాధించగా, ఈసారి కూడా మ్యూజిక్ భారీగా హిట్ అవుతుందనే నమ్మకంతో టీ సిరీస్ రూ.15 కోట్లకు డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే దళపతి విజయ్ ‘జననాయగన్’ సినిమా రిలీజ్‌కు ముందే దాదాపు రూ.260 కోట్లకు పైగా బిజినెస్‌ని లాక్ చేసినట్లు సమాచారం. ఇది విజయ్ కెరీర్‌లోనే కాదు, కోలీవుడ్ హిస్టరీలోను ఒక గొప్ప రికార్డ్. ఇక ఈ సినిమాతో విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, సినిమా విడుదల సమయంలో మరింత రాజకీయ రేఖలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశముంది. మరి సినిమా కంటెంట్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.