Begin typing your search above and press return to search.

నిర్మాత విశ్వప్రసాద్ వ్యాఖ్యలు.. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ డిమాండ్

టాలీవుడ్ లో సినీ కార్మికులు బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 30 శాతం వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ ఫిలిం ఫెడరేషన్ షూటింగ్స్ ను నిలిపివేసింది.

By:  M Prashanth   |   13 Aug 2025 7:51 PM IST
నిర్మాత విశ్వప్రసాద్ వ్యాఖ్యలు.. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ డిమాండ్
X

టాలీవుడ్ లో సినీ కార్మికులు బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 30 శాతం వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ ఫిలిం ఫెడరేషన్ షూటింగ్స్ ను నిలిపివేసింది. ఫిలిం ఛాంబర్ కూడా చిత్రీకరణలు ఆపాలని ఆదేశించింది. దీంతో షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఆ విషయంపై రీసెంట్ గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు.

ఆ సమయంలో ఆర్ట్ డైరెక్టర్స్ కోసం మాట్లాడగా, విశ్వప్రసాద్ కామెంట్స్ ను తెలుగు సినీ ఆర్ట్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ ఇప్పుడు ఖండించింది. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు నోట్ కూడా రిలీజ్ చేసింది. ఏ సినిమా షూటింగ్ లో ఆర్ట్‌ డైరెక్టర్లు ఎంతో కీలకపాత్ర పోషిస్తారని అసోసియేషన్‌ వెల్లడించింది.

అలాంటి వారిని ఉద్దేశిస్తూ నిర్మాత విశ్వప్రసాద్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ట్‌ మాఫియా అని అన్నారని తెలిపింది. అందుకే ఆయన మాటలను ఇప్పుడు ఖండిస్తున్నట్లు చెప్పింది. మూవీ షూటింగ్ సమయంలో ఎన్నో ఛేంజెస్ జరుగుతాయని, సెట్స్‌ లో కూడా మార్పులు చేయాల్సి వస్తుందని అసోసియేషన్ పేర్కొంది.

ఆ సమయంలో నిర్మాతల పర్మిషన్లతో ఎప్పుడూ మార్పులు చేస్తామని, అలాంటప్పుడు ఖర్చులు పెరుగుతాయి కదా అని గుర్తు చేసింది. కొన్నిసార్లు ఖర్చులు కూడా తగ్గుతాయని, దాన్ని అంతా గమనించాలని వెల్లడించింది ఆర్ట్స్ డైరెక్టర్స్ అసోసియేషన్. అయితే ఖర్చుల విషయంలో నిర్మాతకు పూర్తి అవగాహన ఉంటుందని పేర్కొంది.

ఒకవేళ ఆ విషయంపై తప్పుగా మాట్లాడిన నిర్మాత విశ్వప్రసాద్, దాన్ని ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకువెళ్లొచ్చని తెలిపింది. అలా కాకుండా మీడియాలో తమపై నిందలు వేయడం అస్సలు సరికాదని చెప్పాలి. ఎప్పుడైనా అవగాహన లోపం వల్ల నష్టాలు వస్తాయని ఆయన తెలుసుకోవాలని కూడా అసోసియేషన్‌ లేఖలో తెలిపింది.

కాగా, ఇటీవల తన కామెంట్స్ పై విశ్వప్రసాద్ కూడా స్పందించారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని తెలిపారు. కొత్త టాలెంట్ ను అడ్డుకుంటూ, ఇండస్ట్రీ ప్రయోజనాలను పక్కదారి పట్టిస్తూ, తమ సొంత లాభాల కోసం వ్యవస్థను నియంత్రించడం భవిష్యత్తులో పరిశ్రమకు నష్టమని అభిప్రాయపడ్డారు. ఇక్కడి వారికే అవకాశాలు కల్పించాలని, స్కిల్స్ డెవలప్‌ చేయాలని పేర్కొన్నారు.