ట్యాలెంట్ ని వాడుకోలేకపోతున్న టాలీవుడ్!
కంటెంట్ ఉన్న సినిమాలదే హవా. ఆ విషయంలో తెలుగు ప్రేక్షకులకు భాషతో సంబంధం లేదు. కథా బలం ఉన్నా ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు అదరిస్తారని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది.
By: Tupaki Desk | 24 Jun 2025 5:00 PM ISTకంటెంట్ ఉన్న సినిమాలదే హవా. ఆ విషయంలో తెలుగు ప్రేక్షకులకు భాషతో సంబంధం లేదు. కథా బలం ఉన్నా ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు అదరిస్తారని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. తమిళం, కన్నడం, మలయాళ ఇలా ఏ భాషకు చెందిన చిత్రమైనా స్ట్రాంగ్ కంటెంట్ ఉందంటే? అందులో నటీనటులతో పనిలేకుండా ఆదరిస్తున్నారు. ఆ చిత్రాలు కూడా ఇక్కడ భారీ వసూళ్లను సాధిస్తున్నాయి.
వంద కోట్ల క్లబ్ లో చేరడంలో తెలుగు నుంచి వచ్చే వసూళ్లు అత్యంత కీలకంగా మారుతున్నాయంటే? ఎంతగా ఆదరిస్తు న్నామన్నది అద్దం పడుతుంది. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయిన కోర్టు ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. నిర్మాతగా నానికి ఈ సినిమా భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఇలాంటి కథాబలం ఉన్న సినిమాలకు తిరుగుండదని ప్రూవ్ అయిన సందర్భాలు ఈ మూడేళ్ల కాలంలో ఎన్నో చూసాం. కానీ టాలీవుడ్ మాత్రం ట్యాలెంట్ ని సరిగ్గా వాడుకోలేకపోతుంది.
ప్రతిభావంతుల్ని పట్టుకో వడంలో నిర్మాతలు ఇంకా వీక్ గానే కనిపిస్తున్నారు. దిల్ రాజు, సురేష్ బాబు, అరవింద్ లాంటి వాళ్లను మినిహా యిస్తే మిగతా నిర్మాతలెవరు? ట్యాలెంట్ ని సరిగ్గా పట్టుకోలే కపోతు న్నారు. అలా పట్టుకున్నప్పుడే టాలీవుడ్ సక్సస్ రేట్ ఆకాశాన్నంటుంతుంది. అంతటి అను భవన్ని, పరిజ్ఞానాన్ని నిర్మాతలు సంప్రదించాల్సి ఉంది. సినిమా అంటే కేవలం మార్కెట్ లో కోణంలో నిర్మాతలు ఆలోచించకుండా కథ చెప్పడానికి వచ్చిన వాడిలో విషయం ఎంత ఉంది? వాళ్లను ఎలా సానబెట్టాలి? అన్న దానిపై కూడా నిర్మాతలు దృష్టి పెడితే వాళ్లు ఊహించని లాభాలు చూడగలరు.
అదీ 5-6 కోట్ల బడ్జెట్ లోనే సాధ్యమవుతుంది. సరైన ప్రతిభను ఏ నిర్మాత అయితే లాక్ చేయగలడో వాళ్లు సక్సస్ అవుతారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. రాజ్ కందుకూరి అలా సక్సెస్ అయిన నిర్మాతే కదా. టాలీవుడ్ లో ట్యాలెంట్ కి కొదవలేదు. చాలా మంది ప్రతిభావంతులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మాతలు అలాంటి వాళ్లకు దొరకకా, వాళ్లను రీచ్ కాలేక వెనుకబడుతున్నారు.
అలాంటి వాళ్లకు నిర్మాతలు ఓపెన్ గా ఓ వేదిక కల్పించగలిగితే? వాళ్లలో ప్రతిభావంతుల్ని జల్లెడ వేసి పట్టుకోగల్గితే తిరుగుండదు. అలాంటి వాళ్లను పట్టుకుని సినిమా తీయగల్గితే 100 కోట్ల వసూళ్ల ఒక్క తెలుగు మార్కెట్ నుంచే నిర్మాత చూడొచ్చు. ఎందుకంటే సినిమా అనే అభిమానం తెలుగులో ఉన్నంత ఇంకెక్క డా ఉండదు. దాన్ని ఎన్ క్యాష్ చేసుకునే టెక్నిక్ మాత్రమే తెలిసుండాలి. ఈ టెక్నిక్ పట్టుకునే విషయం లో నిర్మాత ఇంకేవిషయాలు పరిగణలోకి తీసుకోకూడదు.
పైగా స్టార్ హీరో సినిమా కూడా ఏడాది ఒకటి రిలీజ్ అవ్వడం కష్టమవుతుంది. గత ఏడాది...ఈ ఏడాది సమ్మర్ థియేటర్లు ఖాళీ. స్టార్ హీరో సినిమా కాదు కదా? మినిమం రేంజ్ ఉన్న హీరో సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఇలాంటి సమయంలో సినిమా వేసుకోల్గితే అన్నీ లాభాలే. పోటీగా సినిమా ఉండదు. స్టార్ హీరో రేస్ లోఉన్నాడు అన్న ఆందోళన ఉండదు. సినిమా యావరేజ్ గా ఉన్నా మంచి లాభాలు చూడొచ్చు.