షేరింగ్ సిస్టమ్‌పై స్పందించిన TSFCC!
అంతే కాకుండా తాజా నిర్ణయంపై ఈ నెల 18న ప్రత్యేకంగా కీలక సమావేశాన్ని నిర్వహించి చర్చించబోతున్నారని వార్తలు వినిపించాయి.
By: Tupaki Desk | 16 May 2025 6:26 PM ISTతెలంగాణలో షేరింగ్ సిస్టమ్‌పై వస్తున్న వార్తలపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) తాజాగా స్పందించింది. తెలంగాణలో తెలుగు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అండ్ కంట్రోలర్స్ అసోషియేషన్ (TTFRCA) తెలుగు సినిమా థియేటర్లలో ఆదాయవిభజన విధానంలో కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతోందని, గత కొన్నేళ్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర నష్టాలని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
అంతే కాకుండా తాజా నిర్ణయంపై ఈ నెల 18న ప్రత్యేకంగా కీలక సమావేశాన్ని నిర్వహించి చర్చించబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అదంతా అవాస్తవమని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ థియేటర్లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలిపింది. తెలంగాణ ఎగ్జిబిటర్లు.. సినిమా థియేటర్లు కేవలం షేర్ ఆధారిత వ్యవస్థలపైనే నడవాలనుకుంటున్నాయని, ఇందు కోసం తీర్మాణం కూడా చేశాయని, అలాగే కొన్ని పర్సెంటేజ్‌పద్దతిలో థియేటర్లు నడపడానికి నిర్ణయం తీసుకున్నారంటూ కొన్ని న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లలో ప్రచారం జరుగుతోంది.
అవన్నీ తప్పుడు వార్తలే అని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శుక్రవారం స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆంధ్రా, తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం మే 18న జరగనుంది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లకు సంబంధించిన పలు సమస్యలపై చర్చిస్తామని, అలాగే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చర్చిస్తామని పేర్కొంది. ఈ సమావేశం పూర్తయిన తరువాత అధికారిక సమాచారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.