Begin typing your search above and press return to search.

ఓదెల 2 బాక్సాఫీస్.. 3 రోజుల్లో ఎంతంటే?

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 సినిమా మంచి హైప్ మధ్య ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

By:  Tupaki Desk   |   20 April 2025 3:52 PM IST
Odela 2 Supernatural Thriller Grosses ₹6.25 Cr in 3 Days Worldwide
X

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల 2 సినిమా మంచి హైప్ మధ్య ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశోక్ తేజ తెరకెక్కించగా, సంపత్ నంది స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. థియేటర్స్‌లో విడుదలైన తొలి షో నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ను బాగా కనెక్ట్ చేసుకుంటోంది.


తమన్నా శివశక్తిగా నటించిన విధానం, ఆమె పాత్రలోని పవర్ ఫుల్ బాడీ లాంగ్వేజ్, భక్తిరసంతో కూడిన హారర్ ట్రీట్‌మెంట్ సినిమాకు ప్లస్‌గా నిలిచాయి. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన ట్రైలర్, టీజర్‌కు అందిన స్పందన చూస్తేనే ఈ మూవీకి ఓ వర్గం ప్రేక్షకులు థియేటర్‌కు రావడం ఖాయమని అర్థమైంది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఈ చిత్రం మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.6.25 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు వెల్లడించారు.

ఈ ఫలితం ఓ మిడ్రేంజ్ సినిమాల పరంగా చూస్తే మంచి విషయమే. మొదటి రోజు నుంచి పాజిటివ్ మౌత్ టాక్ రావడం, మల్టిప్లెక్స్‌లు, టౌన్ ఏరియాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావడం ఈ కలెక్షన్లకు దోహదం చేసింది. ఓదెల గ్రామం నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో దేవతా శక్తి, హారర్ ఎలిమెంట్స్, గ్రామీణ కథానాయకత్వం కలిసి మంచి థ్రిల్‌ను అందించాయి. 6.25 కోట్ల వసూళ్లు సాధించడమే కాదు, రాబోయే వారాంతంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ అందించిన నేపథ్య సంగీతం. శివ శక్తిని ప్రతిబింబించే సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఒక పవర్ ను అందించిందని చెప్పవచ్చు. హారర్ సినిమాల్లో అవసరమైన విజువల్స్, వీఎఫ్‌ఎక్స్, బలమైన సౌండ్ డిజైన్ ఈ చిత్రంలో మిక్స్ అవ్వడంతో ప్రేక్షకుడికి కొత్త అనుభూతి వచ్చింది. తమన్నా నటన, ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆమె ఎమోషనల్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది.

ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.12 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటి మూడు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు చూస్తుంటే, మరో వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మేకర్స్ కూడా మరిన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో బజ్‌ను పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. డిజిటల్, సాటిలైట్ హక్కులు కూడా మంచి ధరలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా చెప్పాలంటే, ఓదెల 2 సినిమా తమన్నా కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ గా నిలిచే అవకాశముంది.