రాజమౌళి, త్రివిక్రమ్ లను నమ్మలేదు కానీ..?
రాజమౌళి, త్రివిక్రం ల స్టార్ ఇమేజ్ తో పోలిస్తే వెంకీ అట్లూరి క్రేజ్ తక్కువే కానీ దర్శకుడిగా ఈమధ్య అతను వెరైటీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
By: Tupaki Desk | 30 April 2025 4:00 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. డబ్బింగ్ సినిమాలే అయినా తెలుగులో సూర్యకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్ తోనే సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తే చూడాలని ఇక్కడ ఫ్యాన్స్ కోరుతున్నారు. కానీ అది ఇప్పటివరకు జరగలేదు. సూర్య మంచి స్వింగ్ లో ఉన్న టైం లో రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇద్దామని అనుకోగా అతను కాదన్నాడు. దాని గురించి ఇప్పటికీ సూర్య ఫీల్ అవుతూ ఉన్నాడు.
రాజమౌళి సినిమా మిస్ అయిన సూర్య నెక్స్ట్ మన మాటల మాంత్రికుడు త్రివిక్రం తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ కూడా మెటీరియలైజ్ అవ్వలేదు. సూర్య తెలుగు సినిమా గురించి ఎప్పుడూ వార్తల్లో రావడం తప్ప సినిమా అనౌన్స్ మెంట్ మాత్రం జరగలేదు. ఐతే రాజమౌళి, త్రివిక్రమ్ లను కాదని ఫైనల్ గా వెంకీ అట్లూరితో సూర్య సినిమా లాక్ చేసుకున్నాడు.
రాజమౌళి, త్రివిక్రం ల స్టార్ ఇమేజ్ తో పోలిస్తే వెంకీ అట్లూరి క్రేజ్ తక్కువే కానీ దర్శకుడిగా ఈమధ్య అతను వెరైటీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు వెంకీ అట్లూరి. అందుకే వెంకీతోనే సూర్య సినిమా లాక్ చేసుకున్నాడు. ఐతే ఈ సినిమా కథ ఏంటి ఎలా ఉండబోతుంది లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.
అంతకుముందు మిస్టర్ మజ్ను, రంగ్ దే అంటూ లవ్ స్టోరీలు చేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి తన పంథా మార్చి సార్, లక్కీ భాస్కర్ సినిమాలు చేసి సర్ ప్రైజ్ చేశాడు. సూర్యతో కూడా కచ్చితంగా మరో అద్భుతమైన కథతో వస్తాడని చెప్పొచ్చు. అసలే సూర్య సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు చేయడంలో ముందుంటాడు. సో కచ్చితంగా సూర్య వెంకీ కాంబో సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. వెంకీ అట్లూరి ఈ సినిమాను కూడా తన ముందు రెండు సినిమా తరహాలోనే ఇంకా సూర్య ఇమేజ్ కి తగినట్టుగా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో తెరకెక్కిస్తార్ని చెప్పొచ్చు. సూర్య కూడా ఈ సినిమాపై క్యూరియాసిటీగా ఉన్నాడని అర్థమవుతుంది.