Begin typing your search above and press return to search.

దసరాకి ముందే భీకరమైన ఫైట్..?

ఇవి కాకుండా ఒకటి రెండు రోజులు హాలీడేస్ కలిసి వస్తే చాలు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తారు. వీటితో పాటు ఆగష్టు 15 కూడా సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది.

By:  Tupaki Desk   |   23 April 2025 8:00 AM IST
దసరాకి ముందే భీకరమైన ఫైట్..?
X

ఒకప్పుడు సినిమాల ఫైట్ అంటే దానికి ప్రత్యేకమైన సీజన్ ఉండేది. సంక్రాంతికి స్టార్స్ ఫైట్, సమ్మర్ లో సినిమాల ఫైట్, దసరాకి మళ్లీ బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాల పోరు, ఫైనల్ గా క్రిస్ మస్ టైం లో సత్తా చాటేలా సినిమాలు ఢీ కొడుతుంటాయి. ఇవి కాకుండా ఒకటి రెండు రోజులు హాలీడేస్ కలిసి వస్తే చాలు సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తారు. వీటితో పాటు ఆగష్టు 15 కూడా సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుంది.

ఈసారి సమ్మర్ ఫైట్ ఆసక్తికరంగా సాగేలా ఉంది. ఐతే దసరా రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు ఉన్నాయి. ఈ దసరాకి బాలయ్య అఖండ 2, సాయి తేజ్ సంబరాల యేటిగట్టు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ ని కూడా సెప్టెంబర్ లో వదులుతారని టాక్. సెప్టెంబర్ 25న సినిమాల ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ఉంది.

ఐతే దసరా కన్నా ముందే ఈసారి క్రేజీ సినిమాలన్నీ వరుస రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నాయి. మే నెల చివర నుంచి జూన్, జూలై, ఆగష్టు ఈ 3 నెలలు సినిమాలు రిలీజ్ లు ఉన్నాయి. జూన్ 5న కమల్ హాసన్ థగ్ లైఫ్ రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా తర్వాత జూన్ 20న ధనుష్ కుబేర రాబోతుంది. కుబేర వచ్చిన వారం రోజులకు మంచు విష్ణు కన్నప్ప వస్తుంది. జూన్ 27న కన్నప్ప రిలీజ్ లాక్ చేశారు.

ఇక నెక్స్ట్ ఆగష్టు 1న మిరాయ్ రిలీజ్ ప్లాన్ చేయగా.. ఆగష్టు 14న సూపర్ స్టార్ రజనీ కూలీ, ఎన్టీఆర్ హృతిక్ నటించిన వార్ 2 లు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల మధ్య క్రేజీ ఫైట్ జరగబోతుందని చెప్పొచ్చు. ఇక ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా రిలీజ్ ఉండే ఛాన్స్ లు ఉన్నాయి. చిరు బర్త్ డే సందర్భంగా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఐతే అఫీషియల్ కన్ ఫర్మేషన్ రావాల్సి ఉంది.

ఆ తర్వాత సెప్టెంబర్ 5న శివ కార్తికేయన్ మదరాసి రిలీజ్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ చివర్లో దసరా సినిమాల సందడి ఉండబోతుంది. ఐతే దసరాకి ముందే ఈ భారీ సినిమాలన్నీ కూడా రిలీజ్ అవుతూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నారు. మరి వీటిలో ఏవి సూపర్ హిట్ అవుతాయి.. ఏ సినిమా సంచలనాలు సృష్టిస్తాయి అన్నది చూడాలి.