బిగ్ బాస్ 9.. టాప్ 5లో అతనికి ఛాన్స్ ఉంటుందా..?
బిగ్ బాస్ సీజన్ 9లో జయం సినిమాలో కమెడియన్ గా చేసిన సుమన్ శెట్టి ఒక కంటెస్టెంట్ గా వచ్చాడు.
By: Ramesh Boddu | 29 Oct 2025 1:15 PM ISTబిగ్ బాస్ సీజన్ 9లో జయం సినిమాలో కమెడియన్ గా చేసిన సుమన్ శెట్టి ఒక కంటెస్టెంట్ గా వచ్చాడు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, బోజ్ పురి లో కూడా నటించిన సుమన్ శెట్టి ఇన్నేళ్ల కెరీర్ లో 300 సినిమాల దాకా చేశాడని తెలుస్తుంది. ఐతే తెలుగులో సుమన్ శెట్టి ఈమధ్య కనిపించలేదు. రీ ఎంట్రీకి బిగ్ బాస్ సరైన ఫ్లాట్ ఫార్మ్ అనుకుని హౌస్ లోకి వచ్చాడు. ఐతే మొదటి రెండు వారాలు హౌస్ లోకి సుమన్ శెట్టి ఎందుకు వచ్చాడు.. అసలు ఏం గేం ఆడుతున్నాడు అనిపించాడు. కానీ ఆ తర్వాత అతని మంచితనం.. టాస్క్ లల్లో అతని ఆట తీరు ప్రేక్షకులను మెప్పించింది.
నా మినేషన్స్ లో కూడా సుమన్ శెట్టిని కాపాడుతూ..
కొన్ని టాస్క్ లల్లో సుమన్ శెట్టికి లక్ కూడా కలిసి వచ్చి విన్ అవ్వడం ఆడియన్స్ దృష్టిలో పడ్డాడు. అంతేకాదు సుమన్ శెట్టి నిజాయితీగా ఆడుతున్నాడన్న భావన కలిగింది. అందుకే అతన్ని హౌస్ లో కొనసాగించేలా చేస్తున్నారు ఆడియన్స్. నామినేషన్స్ లోకి వచ్చినా కూడా సుమన్ శెట్టిని కాపాడుతూ వస్తున్నారు. ఐతే లాస్ట్ వీక్ వరకు హౌస్ లో కేవలం ఫ్లోరా షైనీతో అది కూడా తనని అనవసరంగా ఔట్ చేసిందని గొడవ పడ్డ సుమన్ శెట్టి ఈ వీక్ సంజన మీద సూపర్ ఫైర్ అయ్యాడు.
ఈ వీక్ నామినేషన్స్ లో సంజన తనను చెత్త కెప్టెన్ అన్నందుకు సుమన్ శెట్టి ఆమె మీద ఫైర్ అయ్యాడు. సుమన్ శెట్టిలో ఈ రేంజ్ ఫైర్ ఆడియన్స్ చూడలేదు. ఐతే తన ఆట తాను ఆడుకుంటూ వెళ్తున్న సుమన్ శెట్టికి బయట ఆడియన్స్ దగ్గర నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వస్తుండటం వల్ల అతను మరింత ఎనర్జిటిక్ గా ఆడుతున్నాడు. ఐతే ఇదే దూకుడు చూపిస్తే అతను టాప్ 5కి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది.
ఆట, మాట తీరుతో ఆకట్టుకుంటున్నాడు సుమన్ శెట్టి..
బిగ్ బాస్ సీజన్ 9లో సుమన్ శెట్టి టాప్ 5 దాకా వెళ్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా ఉంది. సీజన్ 9లో సుమన్ శెట్టి ఫస్ట్ 2 వీక్స్ అసలు ఈయన్ను ఎందుకు తీసుకున్నారు అన్నది అర్థం కాలేదన్న ఆడియన్స్ హౌస్ లో సుమన్ ని ఉంచాలి చివరి వారం వరకు అతను ఉండాలనేలా తన ఆట, మాట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇక రాబోయే వారాల్లో మరొక మంచి అవకాశం సుమన్ గ్రాఫ్ పెరిగేలా చేస్తే మాత్రం కచ్చితంగా అతను కూడా స్ట్రాంగ్ కంటెండర్ గా టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి సుమన్ శెట్టి అందుకు అర్హత సాధిస్తాడా లేదా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
