పెళ్లైన వాడితో స్టార్ డాటర్ ప్రేమలో?
ఆ హీరోయిన్ ఓ పెద్ద స్టార్ కుమార్తె. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులోనూ సత్తా చాటింది.
By: Srikanth Kontham | 14 Aug 2025 12:20 AM ISTఆ హీరోయిన్ ఓ పెద్ద స్టార్ కుమార్తె. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులోనూ సత్తా చాటింది. హిందీ లోనూ పని చేసింది. మల్టీట్యాలెంటెడ్ బ్యూటీగానూ ఎంతో ఫేమస్. రిలేషన్ షిప్స్ కూడా అమ్మడు అంతే ప్రాధాన్యత ఇస్తుంది. తొలిసారి విదేశీయుడితో లవ్...మలిసారి స్వదేశీయుడితో కలిసి ప్రయాణం చేసింది. తొలి ప్రేమ ను పెళ్లి వరకూ తీసుకెళ్లింది. కానీ పెళ్లి పీటలెక్కలేదు. డాడ్ కూడా ఒకే చెప్పినా? ఎందుకో ఆ బంధం మధ్యలోనే వీగిపోయింది. అందుకు గల కారణాలు ఏంటి? అన్నది ఇంత వరకూ తెరపైకి రాలేదు.
అటుపై మరో వ్యక్తితో ప్రేమాయణం కూడా కొంత కాలానికే పరిమితమైంది. తొలి అనుభవంతో రెండవ సారి జాగ్రత్త పడిన అమ్మడు మనసును పెద్దగా గాయ పరుచుకోలేదు. లైట్ తీసుకుని కెరీర్ పై సీరియస్ గా దృష్టి పెట్టి ముందుకెళ్లింది. తాజాగా ఆ బ్యూటీ ముచ్చటగా మూడవ సారి కూడా లవ్ లో పడిందని సమాచారం. ఈ సారి ప్రేమలో పడింది బ్యాచిలర్ బోయ్ తో కాదు. ఏకంగా పెళ్లై ఇద్దరు పిల్లలున్న వాడితోనని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడో స్టార్ డైరెక్టర్. కొంత కాలంగా అగ్రహీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు.
మరి ఆ నటి ప్రేమను ఆ డైరెక్టర్ అంగీకరించాడా? అంటే నో అని తెలిసింది. అమ్మడు ప్రేమ ప్రపోజల్ ను చెప్పగానే డైరెక్టర్ సున్నితంగా తిరస్కరించాడుట. తనకు పెళ్లైందని....పిల్లలున్నారని చిన్న పాటి క్లాస్ పీకాడుట. మనసు నొచ్చుకోకుండా సున్నితంగానే తిరస్కరించాడుట. పెళ్లి కాకుండా ఉంటే తనకే కమిట్ అయ్యే వాడినని అర్దమయ్యేలా చెప్పాడుట. పెళ్లైన డైరెక్టర్ కి అంత ధైర్యంగా ప్రపోజల్ ఎలా తీసుకొచ్చిం దంటే? అతడితో ఉన్న చనువు కారణంగానే ఈ ఛాన్స్ తీసుకున్నట్లు వినిపిస్తుంది.
గతంలో కలిసి పని చేసిన అనుభవంతోనే మనసులో మాటను బెణుకు లేకుండా బయట పెట్టినట్లు తెలు స్తోంది. అలాగని వారి మధ్య స్నేహం చెడలేదు. ప్రస్తుతం కూడా వారిద్దరు ఓ సినిమాకు కలిసి పని చేస్తు న్నారు స్నేహితుల్లా. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. ఈసినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆసినిమా వివరాలు అతి త్వరలోనే బయటకు వస్తాయి. అంత వరకూ వెయిట్ అండ్ వాచ్.