Begin typing your search above and press return to search.

SSMB29: జక్కన్న నెక్స్ట్ ప్లాన్ ఏ రేంజ్ లో ఉందంటే..

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న SSMB29 సినిమా.

By:  Tupaki Desk   |   24 Jun 2025 1:00 PM IST
SSMB29: జక్కన్న నెక్స్ట్ ప్లాన్ ఏ రేంజ్ లో ఉందంటే..
X

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా మారింది ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న SSMB29 సినిమా. ఇప్పటికే ఈ మూవీపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇది నెవ్వర్ బిఫోర్ అనేలా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ యడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతుండటంతో, మరోసారి రాజమౌళి సినిమా రేంజ్ ఏంటో చూపించనుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజా అప్‌డేట్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

లేటెస్ట్ గా లీకైన సమాచారం ప్రకారం, మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా ఇంట్రడక్షన్ సీన్ కోసం జక్కన్న తదుపరి షెడ్యూల్ ను కెన్యా అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశం కేవలం వారి పరిచయ సన్నివేశమే కాకుండా.. కథలో ఓ మేజర్ ట్విస్టుగా కూడా ఉంటుందట. అంతేకాదు, ఈ సీన్‌లో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. కెన్యా లొకేషన్లు, ఫారెస్ట్ నేపథ్యం సినిమాకు స్పెషల్ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయట. ఈ సీన్ కోసం భారీ వీఎఫ్‌ఎక్స్ టీమ్, ఇంటర్నేషనల్ టెక్నికల్ క్రూ పనిచేస్తుందని సమాచారం.

అంటే RRR కంటే హై రేంజ్ లోనే విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు సంబంధించిన చిన్న చిన్న డిటైల్స్ బయటకు వచ్చినా.. పూర్తి కథా సూత్రం ఇంకా గోప్యంగానే ఉంది. కానీ రాజమౌళి గత చిత్రాల ట్రాక్ రికార్డు చూస్తే ఈసారి ఇంకెంత భయంకరంగా డిజైన్ చేసి ఉంటారో ఊహించడమే కష్టం. ఇదే సమయంలో ప్రియాంకా చోప్రా కూడా ఇటీవల అమెరికాలో జరిగిన టాక్ షోలో ఈ ప్రాజెక్ట్ గురించి చిన్న క్లారిటీ ఇచ్చారు. భారతదేశంలో షూటింగ్‌ల కారణంగా తన కూతురు మాల్తీని చాలా రోజులుగా చూడలేకపోయానని చెప్పింది.

మహేష్ బాబు నటనకు గ్లోబల్ ప్లాట్‌ఫామ్ మీద పరిచయం కల్పించేలా రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఒక అడ్వెంచర్ ట్రావెలర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ఫిజికల్ గా బాగా ప్రిపేర్ అవుతున్నారని సమాచారం. అంతేకాదు, కథలోని కీలక పాత్రకు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారు.

మొత్తానికి ‘SSMB29’ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కెన్యా షెడ్యూల్ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మళ్లీ నెక్ట్స్ లెవెల్‌కి వెళ్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో ఎంత స్థాయిలో వర్కౌట్ అవుతుందో, ఇండియన్ సినిమా కొత్త రికార్డులను ఎలా తిరగరాయబోతుందో చూడాలి. త్వరలో అధికారిక ప్రకటన వస్తే మరిన్ని ఆసక్తికర అంశాలు బయటకు రానున్నాయి.