కోర్ట్ బ్యూటీకి పెళ్లయిందా.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రాఖీ పండుగ శనివారం కాగా.. అంతకు ముందు రోజు తెలుగు రాష్ట్రాలలో శ్రావణ శుక్రవారం చాలా ఘనంగా జరిగింది.
By: Madhu Reddy | 12 Aug 2025 4:30 PM IST'కోర్ట్ : స్టేట్ వర్సెస్ నోబడీ' చిత్రంతో ఓవర్ నైట్ లోనే లైమ్ లైట్ లోకి వచ్చేసింది యంగ్ బ్యూటీ శ్రీదేవి.. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.58 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో తెలుగులో ఒకటి , తమిళంలో ఒకటి ఇలా రెండు చిత్రాలు చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే సొంతంగా కారు కూడా కొనుక్కున్న ఈమె.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త బాగా వైరల్ అయ్యాయి. ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె.. ఇప్పుడు మరొక వీడియో షేర్ చేయడంతో పెళ్లైపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఆగస్టు 9న ప్రతి ఒక్కరు రక్షాబంధన్ వేడుకను చాలా ఘనంగా జరుపుకున్నారు. ఇక సెలబ్రిటీలైతే తమ సోదరులకు రాఖీ కడుతున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందరిలాగే శ్రీదేవి కూడా తన అన్నయ్యకి రాఖీ కట్టిన వీడియోని తన ఇన్స్టా లో పోస్ట్ పెట్టింది. ఇక అంతే ఆ వీడియో చూసిన అభిమానులు ఆమెను క్షుణ్ణంగా పరిశీలించగా.. ఆమె మెడలో పసుపు తాడును గమనించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మెడలో పసుపుతాడు ఉందేంటి? కొంపతీసి పెళ్లయిపోయిందా? ఇండస్ట్రీ లోకి రాకముందే మీకు పెళ్లి అయ్యిందా? ఇలా సడన్ ట్విస్ట్ ఇచ్చావ్ ఏంటి? అని ఇలా పలు రకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. రాఖీ పండుగ శనివారం కాగా.. అంతకు ముందు రోజు తెలుగు రాష్ట్రాలలో శ్రావణ శుక్రవారం చాలా ఘనంగా జరిగింది. అలాగే శ్రీదేవి ఇంట్లో కూడా వరలక్ష్మీ వ్రతం జరుపుకున్నారు. ఈ వీడియోని కూడా శ్రీదేవి తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ పూజ తర్వాత పసుపు తాడుకు కట్టిన కాయిన్ ను ఆమె మెడలో వేసుకున్నారు. అయితే ఇది చూసిన నెటిజన్లు కొంతమంది పొరపాటుగా ఇది పసుపు తాడు అని, తాళిబట్టుగా భావించి పెళ్లైపోయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక అసలు విషయం తెలిసి ఓ ఇదా సంగతి అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే ఒక్క వీడియోతో అందరిలో అనుమానాలు పెంచేసింది శ్రీదేవి.
శ్రీదేవి విషయానికి వస్తే.. ఎక్కడో కాకినాడలో రీల్స్ చేస్తూ కెరీర్ను ఆరంభించిన ఈమె.. టాలెంట్ ని చూసి డైరెక్టర్ ఈమెకు సినిమాలో అవకాశం కల్పించారు. అలా రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని, నాచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియదర్శి పులికొండ, శుభలేఖ సుధాకర్, సాయికుమార్, హర్ష్ రోషన్, శివాజీ , హర్షవర్ధన్, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. చిన్న సినిమాగా వచ్చి ఇప్పుడు మంచి విజయాన్ని అందుకొని, అటు శ్రీదేవికి కూడా ఊహించని ఇమేజ్ అందించింది.