'సింగిల్' ట్రైలర్.. అబ్బాయిల కోసం శ్రీ విష్ణు లవ్ టిప్స్
తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో రొమాంటిక్ కామెడీ సినిమా రాబోతోంది. ఎంటర్టైన్‌మెంట్ కింగ్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'సింగిల్' సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది.
By: Tupaki Desk | 28 April 2025 3:58 PM ISTతెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో రొమాంటిక్ కామెడీ సినిమా రాబోతోంది. ఎంటర్టైన్‌మెంట్ కింగ్ శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'సింగిల్' సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. గీతా ఆర్ట్స్ సమర్పణలో, కాల్య ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కు న్యూ డోస్ ఇవ్వబోతున్నట్లు ట్రైలర్ స్పష్టంగా చెబుతోంది.
ట్రైలర్ ప్రారంభం నుంచే నవ్వులు పూయించేలా ఉంటుంది. శ్రీ విష్ణు ప్రేమలో విజయవంతం కావాలంటే మూడు టిప్స్ అంటూ చెప్పడం ఫన్‌గా కనిపించింది. ముద్దుగా మంచి అబ్బాయిగా కనిపించడం, తరువాత బ్యాడ్ బాయ్ యాటిట్యూడ్ చూపించడం, చివరగా మాస్ వాయిస్‌లో రౌడీగా మారడం వంటి మూడు దశలను ఫన్నీగా చూపించారు.
ఈ క్రమంలో పూర్వ అనే అమ్మాయిని ప్రేమించగా, మరో అమ్మాయి హరిణి గుండె లోతుల్లో ప్రేమను పంచుకుంటోంది. ఇలా ట్రయాంగిల్ లవ్ లో కథ నడుస్తుందని అర్థమవుతోంది. ఈ కథనానికి సరదా గమ్మత్తైన ట్రీట్‌మెంట్‌తో కాంబినేషన్ ఇచ్చారు. శ్రీ విష్ణు టైమింగ్, డైలాగ్ డెలివరీ ట్రైలర్‌లోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా బాలకృష్ణ స్టైల్‌ను అనుకరిస్తూ ఇచ్చిన మిమిక్రీ సీన్ నవ్వులు తెప్పించనుంది. కేతికా శర్మ, ఇవానాలు కూడా తమ క్యారెక్టర్‌లకు పర్ఫెక్ట్ గా సరిపోయారు. వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టెక్నికల్‌గా చూస్తే, సినిమాకు బలమైన సపోర్ట్ కనిపిస్తోంది. ఆర్. వెల్‌రాజ్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌కు స్పెషల్ లుక్ ఇచ్చింది.
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ సినిమాకి ఎనర్జీని పెంచింది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ స్పీడ్‌తో సినిమా రీతిని క్లీన్‌గా తీసుకెళ్లేలా ఉంది. గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ నిర్మాణ విలువలు సినిమా ప్రమోషన్స్‌లోనే హై స్టాండర్డ్‌గా కనిపిస్తున్నాయి. ఈ వేసవిలో మజా కోరుకునే ప్రేక్షకులకు 'సింగిల్' సినిమా మంచి ట్రీట్ అవుతుందనడంలో సందేహం లేదు. మే 9న థియేటర్లలో విడుదలకానున్న ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ రెండింటినీ ఆకట్టుకునేలా టచ్ చేస్తుందని ట్రైలర్ చూపిస్తోంది. మరి శ్రీ విష్ణు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.