శ్రీ విష్ణు ‘సింగిల్’ బాక్సాఫీస్ రచ్చ.. ఎక్కడైనా లాభాలే..
టాలీవుడ్‌లో డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో ఆకట్టుకునే హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేలా ఆడియెన్స్ లో ఓ నమ్మకం కలిగిస్తున్నాడు.
By: Tupaki Desk | 14 May 2025 11:35 AM ISTటాలీవుడ్‌లో డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో ఆకట్టుకునే హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేలా ఆడియెన్స్ లో ఓ నమ్మకం కలిగిస్తున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన అతని లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కామెడీ, రొమాన్స్‌తో నిండిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది.
ఈ సినిమా క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరినీ ఆకర్షిస్తూ, శ్రీ విష్ణు రేంజ్ ను పెంచింది. ‘సింగిల్’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాతలకు భారీ లాభాలను అందిస్తోంది. కేవలం మొదటి వీకెండ్‌లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా, వీక్‌డేస్‌లో కూడా టాప్ ట్రెండ్‌లో కొనసాగుతోంది. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాల్లో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో సందడి చేస్తున్నాయి.
ఈ సినిమా గుంటూరులో 58% ఆక్యుపెన్సీ సాధించి ప్రాంతీయంగా భారీ ఆదరణ పొందింది. ఓవర్సీస్‌లో ‘సింగిల్’ సినిమా మరో రికార్డు సృష్టించింది. అమెరికాలో ఈ సినిమా US$500K (రూ.4.2 కోట్లు) మార్క్‌ను దాటింది, ఇది US డిస్ట్రిబ్యూటర్ కు డబుల్ లాభాలను అందించింది. సినిమా ఓపెనింగ్ డే నుంచే అమెరికాలో $150K సాధించి, మూడు రోజుల్లో $300K దాటి, ఇప్పుడు $500K మైలురాయిని అందుకుంది. ఈ విజయం శ్రీ విష్ణు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా క్రేజ్‌ను చూపిస్తోంది.
శ్రీ విష్ణు నటన, సినిమా స్క్రీన్‌ప్లే అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఫన్నీ వన్-లైనర్స్, కామెడీ పంచ్‌లు థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. క్లీన్ కామెడీతో నిండిన ఈ సినిమా, శ్రీ విష్ణును టాలీవుడ్‌లో హెల్తీ ఎంటర్‌టైనర్స్‌కు కొత్త ప్రతినిధిగా నిలిపింది.
కార్తిక్ రాజు డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కల్యా ఫిల్మ్స్ నిర్మించాయి. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. సినిమా రొమాంటిక్ కామెడీ జోనర్‌లో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అల్లు అరవింద్ ఈ సినిమా లాభాల్లో కొంత భాగాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇస్తామని ప్రకటించడం మరో విశేషం.
మొత్తంగా, ‘సింగిల్’ సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాల వర్షం కురిపిస్తోంది. మార్కెట్ కష్టాల్లో ఉన్న సమయంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను రివైవ్ చేసే దిశగా అడుగులు వేస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.